టాలీవుడ్ ప్రముఖులూ కరోనా బారిన పడుతున్నారు. చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత అల్లు అరవింద్ వంటివారు కరోనా బారిన పడికోలుకోగా…తాజాగా అల్లుఅర్జున్ కు కరోనా సోకింది. తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు బన్నీ. కొన్నిరోజులుగా కరోనా లక్షణాలు బయటపడడంతో టెస్టులు చేయించుకున్నానని పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారని చెప్పాడు. ‘అందరికీ నమస్కారం. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. మా ఇంట్లోనే ఐసోలేషన్‌కు వెళ్లిపోయాను. ఇటీవల నన్ను కలుసుకున్న వారు కరోనా టెస్టులు చేయించుకోండి,
ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దు. అందరూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి’
అని అర్జున్ ట్వీట్ చేశాడు.