కరోనా మహమ్మారిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటూ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేయడం ద్వారా రాష్ట్ర విపత్తు నివారణ నిధులను కరోనా బారినపడ్డ బాధితుల బాగుకోసం ఉపయోగించుకోవచ్చని లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతులను ఇవ్వాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలోని లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. వేలాది మంది ప్రజల ఆర్ధిక పరిస్థితులు దెబ్బతిన్నాయని.. అందుకోసమే ఈ నిధులను ఉపయోగించుకోవాలని తాము భావిస్తున్నట్లు ఉద్దవ్ లేఖలో వెల్లడించారు. విపత్తు నివారణ నిధులను వినియోగించాలంటే చట్టపరమైన అనుమతి అవసరమని.. అందుకే కేంద్రానికి లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1382629320422674434