కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రాకు కూడా కరోనా సోకింది. నిన్ననే పార్టీ చీఫ్ సోనియాగాంధీకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. సోనియా నిన్నటి నుంచే హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఇక తాజాగా తనకు పాజిటివ్ అని తేలినట్టు ప్రియాంక ట్వీట్ చేశారు. తనకు కూడా స్వల్పంగా జ్వరం రావడం, ఇతర లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించానని పాజిటివ్ వచ్చిందని ఆమె తెలిపారు. కొన్నిరోజులుగా తనకు సన్నిహితంగా మెదిలినవారు పరీక్ష చేయించుకోవాలని ఆమె సూచించారు. నిబంధనల మేరకు తాను క్వారెంటైన్లో ఉన్నట్టు ఆమె చెప్పారు.
https://twitter.com/priyankagandhi/status/1532587439553843201?s=20&t=myXCIk-9-V27udLiWSrkfg
యూపీలో పార్టీ నవసంకల్ప కార్యశాలకు వచ్చిన ప్రియాంక తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని రాత్రే ఢిల్లీకి వెళ్లిపోయారు. అటు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమె కోలుకుంటోందని పార్టీ వర్గాలు తెలిపాయి.