అదానీ ప్రభావం పార్లమెంట్ ఉభయసభలపై పడింది. ఆదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడిందని హిండన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీజేఐ తో లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే నిరాధార ఆరోపణలు చేస్తూ సభా సమయం వృధా చేయవద్దని స్పీకర్ నచ్చజెప్పినా వినలేదు. రాజ్యసభలోనూ ఇదే అంశంపై సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకుండా నిరసనలు వ్యక్తం చేస్తుండడంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేశారు.
                                                                    



