మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పర్సనల్ అంశాలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. కొందరు ఐరోపా మహిళలు సహా అనేక మందికి ఆయన పర్సనల్ లెటర్స్ రాశారు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఈ లేఖలు ఎక్కడ ఉన్నాయి అనేది వివాదం గా మారింది. దీనిమీద కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
……………….
ప్రధానమంత్రి కార్యాలయం సంబంధించిన లెటర్స్ అన్ని మ్యూజియం లో దాచిపెట్టడం ఆనవాయితీ. అలాగే మొదటి ప్రధానమంత్రి నెహ్రూ లేఖలు కూడా భద్రపరిచారు. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సోనియాగాంధీ పావులు కదిపారు.
2008 ఏప్రిల్ 29న సోనియా గాంధీ తరఫున ప్రతినిధి ఎంవీ రాజన్ చేసిన విజ్ఞప్తి మేరకు, నెహ్రూకు సంబంధించిన ప్రైవేటు కుటుంబ లేఖలు, డాక్యుమెంట్లను ఆమె కు పంపించేశారు. మొత్తం 50 కార్టన్ల నిండా లెటర్స్, రహస్య పత్రాలను సోనియా గాంధీకి పంపించారు. అప్పటినుంచి తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రి మ్యూజియం పలుమార్లు కోరుతోందని, 2025లో కూడా రెండు సార్లు లేఖలు రాసినట్లు సాంస్కృతిక శాఖ స్పష్టం చేసింది. తాజాగా పార్లమెంటు సమావేశాలలో బిజెపి ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు.
………………..
నెహ్రూకు సంబంధించిన అన్ని పత్రాలు భారత ప్రభుత్వ జాతీయ వారసత్వానికి చెందినవని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఇవి వ్యక్తిగత ఆస్తులు కావని, దేశ ప్రజలకు, పరిశోధకులకు అందుబాటులో ఉండాల్సిన చారిత్రక ఆధారాలని పేర్కొంది.
చరిత్రను దాచిపెట్టకుండా, జాతీయ వారసత్వాన్ని ప్రజల ముందుంచాలన్నదే కేంద్రం ఉద్దేశం.
…………………
కానీ ఈ లేఖలు బయటపడకుండా సోనియా గాంధీ మరియు ఆమె టీం దాచిపెడుతున్నారు. దీంతో ఆ లేఖలలో చాలా రహస్యాలు ఉన్నాయి అన్న మాట గుప్పు మంటోంది. అప్పట్లో నెహ్రూ కొంతమంది ఐరోపా మహిళలతో ప్రేమాయణం నడిపారు అని వివాదం ఉంది. సెల్ ఫోన్లు వాట్సాప్ లు లేని రోజులు కాబట్టి,, సమాచారం అంతా లేఖల రూపంలోనే సాగింది అని అంటారు. ఈ క్రమంలో దేశానికి సంబంధించిన రహస్యాలు ఐరోపా దేశాలకు తరలిపోయాయి అనేది పెద్ద విమర్శ. అందుచేతనే నెహ్రూ లేఖలు బయటకు రాకుండా సోనియాగాంధీ దాచేస్తున్నారు అని ప్రత్యర్థి పార్టీ లు అంటున్నాయి.

