తాళి లేదు, మెట్టెలు లేవు.. అదే సమంత పెళ్లి.. Controversy in Samantha Marriage || Pancha Bhutha Shudhi Vivaham
…………………………………………………………………………
హీరోయిన్ సమంత పెళ్లి ఇప్పుడు వివాదం రేపుతోంది. హీరో నాగ చైతన్య కు విడాకులు ఇచ్చాక, సమంత కంటిన్యూగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. నాగ చైతన్య ఇప్పటి దాకా పెళ్లి ఊసెత్తలేదు, కానీ సమంత నిర్మాత దర్శకుడు రాజ్ నిడిమోరు ని పెళ్లి చేసుకొన్నారు.
………………………….
ముఖ్యంగా ఈ పెళ్లిని సాధారణ హిందూ సంప్రదాయాల్లో కాకుండా, ప్రత్యేకమైన పంచ భూత శుద్ధి విధానంలో నిర్వహించటం అందరి దృష్టిని ఆకర్షించింది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను ఆధ్యాత్మికంగా శుద్ధి చేసి, వధూవరుల శరీర-మనసు-శక్తులను సమతుల్య స్థితికి తీసుకెళతారు. అత్యంత సన్నిహితుల సాక్షిగా జరిగే ఈ పెళ్లిలో వైభవం కంటే ఆత్మీయతకుసింప్లిసిటీ కు ప్రాధాన్యం ఇస్తారు.
………………………………………………………
సాధారణ హిందూ వివాహాల్లో సప్తపది, కంకణబంధనం, మంగళసూత్ర ధారణ వంటి సంప్రదాయాలు తప్పకుండా ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథులతో జరిగే ఈ వేడుకల్లో … కట్టుబాట్లు, కుటుంబ సంప్రదాయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ పంచ భూత శుద్ధి వివాహంలో యోగ పద్ధతులు, శక్తి శుద్ధి ప్రక్రియలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందువల్లే ఈ విధానంలో మంగళసూత్రం ఉండదు, మెట్టెలు పెట్టడం కూడా కనిపించదు. దండలు మార్చుకోవటానికి కూడా దూరంగా ఉంటారు. అందుకే దీనిని “ఆత్మీయ వివాహం”గా కొంతమంది వర్ణిస్తారు.
……………………………………..
సమంత–రాజ్ వివాహం కూడా ఇదే విధంగా, అత్యంత సాదాసీదాగా, కేవలం 25–30 మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. సమంత ఎరుపు చీరలో అందంగా అలంకరించుకోగా, రాజ్ సాధారణ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. సమంత మెడలో మంగళసూత్రం లేనే లేదు. ఒక లాకెట్ మాత్రం వేసుకొన్నారు. కాళ్లకు మెట్టెలు కూడా పెట్టుకోలేదు. పెళ్లి తర్వాత అత్తవారింట్లో సమంతకు అందించిన స్వాగతం తో ఈ విషయాలన్నీ బయట పడ్డాయి.
………………………..
వివాహం అనంతరం సమంత సామాజిక మాధ్యమాల్లో కొన్ని చిత్రాలను షేర్ చేయగా, అభిమానులు ఆశీస్సులతో స్పందించారు. సినీ ప్రముఖులు, స్నేహితులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకో విచిత్రం ఏమిటంటే… ఈ పంచభూత శుద్ది వివాహం అనే విధానంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు. గతంలో పెళ్లి అయినవారు కూడా ఈ విధానంలో మరో భాగస్వామిని ఎంచుకోవచ్చు. అందుచేత రెండో పెళ్లి లేక మూడో పెళ్లి చేసుకొనే వాళ్లకు ఈ పంచ భూత శుద్ధి పెళ్లి బాగా అనువుగా ఉంటుందని సమంత పెళ్లితో నిర్ధారణ అయింది.

