ఎన్నికల ప్రచార సభలో పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక్కడ సౌకర్యంగా బతుకుదామని యూపీ, బిహార్ నుంచి వచ్చే వాళ్లను అడ్డుకుంటామని చన్నీ వ్యాఖ్యానించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చన్నీ ఈమాట అనేటప్పుడు అదే వేదికపై ఆయన పక్కనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా ఉన్నారు. ఆయన్ని వారించకపోగా…ఉత్సాహంగా చప్పట్లు కొట్టడం కనిపించింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.
చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ, ఆప్ మండిపడుతున్నాయి. యూపీ, బిహార్ ప్రజలను ఆయన అవమానించారని సీఎం స్థాయి వ్యక్తి ఇలా అనడమేంటని నిలదీస్తున్నాయి.