అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 18 వందల కోట్లు వెచ్చించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఫైజాబాద్ లో జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఆలయనిర్మాణానికి సంబంధించిన ఈ మొత్తం వ్యయానికి ఆమోదం తెలిపారు. భక్తుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ట్రస్టు రామాలయం నిర్మాణం కోసం మార్గదర్శకాలను రూపొందించిందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి చేయాలనిలక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 జనవరి మకర సంక్రాంతి నాటికి రాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు.