
………………………………
ఒక్కసారిగా దేశీయ విమానాల్లో సంక్షోభం ఏర్పడిపోయింది. టికెట్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వందలాది విమానాలు రద్దు అయిపోయాయి. సరిగ్గా రష్యా అధ్యక్షులు వ్లాదిమర పుతిన్ పర్యటన సమయంలోనే ఇదంతా ఎందుకు జరిగింది. కొన్ని విదేశీ శక్తులు కుట్ర చేయటం వల్లనే ఈ పరిస్థితి అన్న మాట బలంగా వినిపిస్తోంది.
………………………………
ఇందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
* రోస్టరింగ్ సాఫ్ట్వేర్ లొసుగులు
విమాన సంస్థలలో పైలట్ల డ్యూటీ షెడ్యూలింగ్‌ను నిర్వహించే రోస్టరింగ్ సిస్టమ్‌లో లోపాలు వచ్చేశాయి. విదేశీ సాఫ్ట్వేర్లపై ఆధారపడటం వల్ల ఆల్గారిథమ్‌లో మార్పులను గుర్తించలేకపోయారు. ఇటువంటి లోపం ఒకేసారి వందల ఫ్లైట్ల కార్యకలాపాలు దెబ్బతినేలా చేసింది.
* ACARS లోడ్ షీట్ అప్లోడ్ సమస్యలు
పైలట్లకు అవసరమైన లోడ్ షీట్లు సాఫ్ట్ వేర్ ద్వారా చేరలేదు. డిజిటల్ డేటా రాకపోతే పైలట్లు చేతితో లెక్కలు వేయాల్సి రావడం వల్ల అదనంగా అరగంట సమయం పట్టింది. ఈ ఆలస్యం ఫ్లైట్ స్లాట్లను కోల్పోయేలా చేసింది.
* డేటా లింక్‌లో లేటెన్సీ మరియు ప్యాకెట్ లాస్ సమస్యలు
విమాన-గ్రౌండ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో లేటెన్సీ పెరగడంతో కీలక డేటా సమయానికి చేరలేదు. నెట్వర్క్ వేగం తగ్గడంతో వివిధ ఫ్లైట్ ఆపరేషన్లలో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఒక డేటా లింక్ గందరగోళం మొత్తం షెడ్యూల్‌ను నెమ్మదింపజేసింది.
* FDTL వల్ల ఏర్పడిన విషవలయం
పైలట్ల డ్యూటీ టైమింగ్స్ దాటిపోవటంతో అనేక మంది పైలట్లు డ్యూటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొత్త పైలట్లను అందుబాటులోకి తీసుకురావడానికి సమయం పట్టడంతో మరింత గందరగోళం ఏర్పడింది. ఈ విధంగా ఒక చిన్న ఆలస్యం పెద్ద టెన్షన్ కు దారి తీసింది.
* CAT-III సర్టిఫైడ్ పైలట్ల డ్యూటీలు
పొగమంచులో ల్యాండింగ్‌కి అవసరమైన CAT-III పైలట్లు ను పక్కకు తప్పించారు. కీలక సమయంలో షెడ్యూల్లో లేకపోవడం తో ల్యాండింగ్ లో ఇబ్బంది వచ్చింది. దీని ఫలితంగా అనేక విమానాలు డైవర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* పైలట్ డేటాబేస్ ట్యాగ్లలో గందరగోళం
పైలట్ల సర్టిఫికేషన్ వివరాలు డేటాబేస్‌లో తప్పుగా ప్రతిబింబించడం వల్ల ఫ్లైట్లకు సరైన సిబ్బంది అందుబాటులో లేకపోయారు. చివరి నిమిషంలో పైలట్లకు గమ్యస్థాన విమానాశ్రయం పరిస్థితులు సరిపోవని తెలియడంతో మార్గం మార్చాల్సి వచ్చింది. ఈ సమస్య అనేక గంటల ఆలస్యాలకు దారితీసింది.
* ఒక్క ఫ్లైట్ ఆలస్యం మొత్తం నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం
ఒకే ఫ్లైట్ 10–15 నిమిషాలు ఆలస్యం అయినా, అదే పైలట్లు లేదా అదే విమానం తదుపరి ఫ్లైట్లకు వెళ్ళడం వల్ల ప్రభావం వరసగా వ్యాపించింది. ఇది ‘కాస్కేడింగ్ ఎఫెక్ట్’ రూపంలో వందల ఫ్లైట్లను ప్రభావితం చేసింది. పెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఇలాంటి ప్రతికూల ప్రభావం ఊహించిన దానికంటే వేగంగా వ్యాపిస్తుంది.
………………………………………………………………….
ఈ సమస్యలకు మూల కారణం విమానాలను నిర్వహించే డేటా బేస్ లు, సర్వర్ లు విదేశాలలో ఉంటున్నాయి. అక్కడ కొన్ని విదేశీ శక్తులు గందరగోళం స్రుష్టించాయి అంటున్నారు. ఎందుకంటే.. తాజా విమానాల సంక్షోభానికి కారణం పూర్తిగా సాఫ్ట్ వేర్ సమస్యలే. అది కూడా రష్యా అధ్యక్షులు పుతిన్ మన దేశంలో ఉన్నప్పుడే చోటు చేసుకొన్నాయి. దీనిని బట్టి సైబర్ కుట్ర జరిగింది అన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రపంచ దేశాలలో భారత్ పరువు తీసేయాలన్న ఉద్దేశ్యంతో ఈ కుట్ర జరిగిందా అన్న అనుమానాలను చాలా మంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


