ఆదానీ వ్యవహారంలో అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంమంత్ర స్మృతీ ఇరానీ స్పందించారు. ఈ వంకతో కొన్ని విదేశీ శక్తులు భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో కూడా జార్జి సోరోస్ ఇలాంటి కుట్రలే పన్నాడని ..మోదీ వంటి వారిని టార్గెట్గా చేసుకునేందుకే ఆయన బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించినట్టు మంత్రి గుర్తు చేశారు. ఇక్కడి ఎవరెవరికి ఆయన నిధులు ఇచ్చాడో దేశానికంతా తెలుసన్నారు. ఆదానీ గ్రూప్ వ్యవహారంలో తాజాగా జార్జి చేసిన ప్రకటనను భారతీయులంతా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదానీ వ్యవహారంలో మోదీ మౌనంగా ఎందుకున్నారని జార్జి సోరస్ ప్రశ్నించాడు. ఇంకా అనవసర వ్యాఖ్యలూ చేశాడు.ప్రపంచ బిలియనీర్లలో ఒకటైన జార్జి సోరోస్.. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా గతంలో ఇక్కడి వ్యక్తులకు, సంస్థలకు భారీగా ఫండింగ్ చేశాడు.