తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పనిచేసినా గ్రాండ్ గా చేసేందుకు ఇష్టపడతారు. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన కుల గణన విషయంలో కూడా అదే ఫాలో అయ్యారు. మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సామాజిక విప్లవం అని అభివర్ణించారు. కానీ ఇంతటి సర్వే రిపోర్ట్ ను చదివితే ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే ప్రశ్నలను బీసీ సంఘాలు సూటిగా అడుగుతున్నాయి.
….
అందులో మొదటిది … ఇందులో రాజ్యాంగ విరుద్ధమైన పదాలు వాడటం. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని పేర్కొన్నారు. తద్వారా ఈ కుల గణ సర్వే ఎప్పటికీ కోర్టుల ముందు నిలబడలేని పరిస్థితి తీసుకొని వచ్చారు.
….
మరో వైపు బీసీల జనాభా తగ్గినట్లు చూపించటం వివాదం అవుతోంది. మండల్ కమిషన్ లోనూ 51%, బీఆర్ఎస్ సమగ్రకుటుంబ సర్వేలోనూ.. 52% బీసీలున్నారని వెల్లడైంది. మరి ఈ సంఖ్య ఎలా 46%కి వచ్చింది అన్న ప్రశ్న ఉదయిస్తోంది. 4కోట్ల జనాభాలో దాదాపు 6% తగ్గుదల బీసీలకు చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతోందని అంటున్నారు.
….
మరో వైపు, ముస్లింలను ఆకాశానికి ఎత్తేస్తూ సర్వే రిపోర్టు చూపించింది. 12% ముస్లింల జనాభాను చూపిస్తూ.. 2% ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని చూపించడం వివాదాస్పదం అవుతోంది. అంటే ముస్లిం జనాభాలో 80 శాతం పైగా వెనుకబడినవారు అని నిర్ధారించారు. దీనికి ప్రాతిపదిక ఏమిటి అన్నది మాత్రం చూపించలేదు.
..
ఇదంతా ఒక ఎత్తయితే, ఈ సర్వేలో ఎక్కడా క్రైస్తవుల మాట ఎత్తలేదు. అంటే తెలంగాణ లో క్రైస్తవులు లేనే లేరు అనుకోవాలా అని అంటున్నారు. ముస్లింలో 80 శాతం మంది వెనుకబడిన వారు ఉంటే క్రైస్తవుల్లో అసలు ఎవరూ వెనుకబడి లేరా.. లేదా.. అసలు తెలంగాణ లో క్రైస్తవులే లేరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
…
పార్టీ తరపున 42 శాతం టిక్కెట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మరో మెలిక పెట్టింది. ఇందులో ముస్లింల వాటా ఎంత అన్నది ఏమాత్రం చెప్పలేదు. ఎందుకంటే గతంలో.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే.. ఇందులో 18 మాత్రమే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లింలకు కట్టబెట్టేశారు. అదేమంటే, అవన్నీ బీసీ ముస్లింలు అంటూ దబాయించేశారు. ఇప్పుడు కూడా అదే డ్రామా కొనసాగిస్తారు అన్న మాట వినిపిస్తోంది.
….
మొత్తం మీద రేవంత్ రెడ్డి మార్కు హడావుడి కనిపించింది తప్పితే,, ఈ సర్వే రిపోర్టు తో బీసీలకు దక్కింది ఏమిటి అన్నదే పెద్ద ప్రశ్న. నిజానికి బీసీ వర్గాలకు ప్రయోజనం కలిగేట్లుగా ఏమయినా తీర్మానాలు చేసినా,, కొంత లో కొంత ఉపయోగం ఉండేది. అదేమీ లేకుండా ఉత్తుత్తి ప్రసంగాలతో రేవంత్ రెడ్డి సరిపెట్టారు.