కొంతకాలంగా దేశమంతటా రిజర్వేషన్ల మీద చర్చ నడుస్తోంది. మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, బీసీ వర్గాల రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని కాంగ్రెస్ నాయకులు , కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే రెండు రోజులకు ఒకసారి ఇదే మాట పలుకుతున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిని బాగా ప్రచారంలోకి తెచ్చేశారు.
దీనికి సంబంధించి బిజెపి పదేపదే ఒక స్పష్టత ఇస్తోంది. మతపరమైన రిజర్వేషన్లు అంటే ముస్లింల రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని చెబుతోంది అంతే తప్ప హిందూ మతం లోని బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్స్ పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న పార్టీ తమదే అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు మొదటి నుంచి అమలు చేస్తున్న విధానాలను ఒకసారి చూద్దాం.
కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో బీసీలను పక్కనపెట్టి ముస్లిం మైనార్టీలు ముందు వరుసలోకి తేవడం జరిగింది.
() నెహ్రూ హయాంలో ముస్లిం అలీఘడ్ యూనివర్సిటీ లో SC/ST లకు అప్పటి వరకు రిజర్వేషన్లను తొలగించింది
() ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ-కాశ్మీర్ లో SC/ST/OBC లకు రిజర్వేషన్లు తొలగించింది.
() ఆర్టికల్ 371 ద్వారా ఈశాన్య రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్లను తగ్గించింది.
() 2011 సోనియా గాంధీ హయాంలో జమాతే ఇస్లామీయ యూనివర్సిటీ లో ఉన్న SC/ST/OBC ల రిజర్వేషన్లు తగ్గించింది.
() కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక లో ముస్లింలను BC లలో కలిపి వారికి 6% రిజర్వేషన్లను కల్పించి OBC లకు ద్రోహం చేసింది
() 2013 లో OBC ల 27% నుండి 4% తగ్గించి ముస్లిలకు కట్టబెట్టే చట్టం తయారు చేసింది.
() మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లు / చట్టం తయారు చేయడానికి వెనుకాడినది.
బీసీలకు ద్రోహం చేసి ఆ కోటాను ముస్లింల వైపు మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది అనేది అర్థమవుతుంది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం బీసీ ఎస్సీల రిజర్వేషన్లకు రామే కారకులు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది.
రిజర్వేషన్లు పరంగా బిజెపి విధానాలను ఒకసారి పరిశీలిద్దాం.
() భారత దేశాన్ని 17 సంవత్సరాలు BJP పాలించింది.
కాని ఎక్కడా ఎన్నడూ రిజర్వేషన్లు తగ్గించలేదు.
() ఆర్టికల్ 370 ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో SC/ST/OBC లకు రిజర్వేషన్లు కల్పించింది
() మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించింది
() వికలాంగులకు 3% రిజర్వేషన్లు కల్పించింది
() వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించింది. కానీ ఇందుకోసం బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గించలేదు.
() అలీఘర్, జామియా యూనివర్సిటీ లలో తిరిగి SC/ST/OBC లకు రిజర్వేషన్లు కల్పించింది.
ఇన్ని చేసినా BJP రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.
బీసీ ఎస్సీల రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో కాపాడుతామని తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో వెల్లడించారు ఈ విషయంలో తమదే గ్యారెంటీ అని ఆయన స్పష్టం చేస్తున్నారు.