రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అసలైతే ముఖ్యనాయకులను ఈడీ విచారించడం ఈ దేశంలో మొదటిసారేం కాదు. ప్రస్తుత ప్రధానిని గతంలో సిట్ కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… 2002లో అల్లర్లు జరిగాయి. విచారణలో భాగంగా …సిట్ 71 ప్రశ్నల సెట్ ద్వారా మోదీని కొన్ని గంటలపాటు ప్రశ్మించింది. అహ్మదాబాద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో .. ఆ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లేదని సిట్ చెప్పడంతో మోదీకి ఊరట లభించింది.
వాస్తవానికి కోర్టు పనులు పర్యవేక్షిస్తున్న సందర్భంలో ED ఏమి చేయాలి? ఏ ఇన్వెస్టిగేషన్ లోనైనా ప్రశ్నించడం అనేది సాధారణమైన పని. ఈడీ అధికారులు ఆ పని చేయకపోతే, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు కోర్టు సులభంగా వారిని దోషులుగా నిర్ధారిస్తుంది.
చట్టానికి అతీతం అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు వ్యవహరిస్తున్నారు.వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రులు తమ తమ రాజ్యాంగ బాధ్యతలను వదలి ఢిల్లీలో నిరసనకు దిగారు. ఇక హైదరాబాద్ లో అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఏకంగా ఓ పోలీసు కాలర్ నే పట్టుకుని హెచ్చరించింది.
ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎంత స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అప్పటికే గుజరాత్ ను అభివృద్ధిపథాన నడిపించిన సీఎంగా నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నారు. ఆయన్ని సిట్ ప్రశ్నించడం పట్ల పార్టీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసి ఉండవచ్చు. కానీ ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు మాత్రం తెలపలేదు. ఒకరోజు దాదాపు 9 గంటలు మోదీని సిట్ అధికారులు ప్రశ్నించారు. అంతసేపూ ఓపిగ్గా వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చారు ప్రస్తుత ప్రధాని.