
జమాతే ఇస్లామి అనేది పాకిస్తాన్ లో ఒక రాజకీయ పార్టీ.. దీనికి ఆ దేశంలో గల పలు టెర్రర్ గ్రూప్స్ తో సంబంధాలు వున్నాయి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ జమాతే ఇస్లామిక్ సంస్థ అమెరికన్ బ్రాంచ్ పేరు ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికా (ICNA) దీనికి కూడా లష్కరే సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోణలున్నాయి. ఈ సంస్థ పెద్ద అబ్దుల్ మాలిక్ ముజాహిద్.
ఈ ముజాహిద్ ఆప్తమిత్రుడు షేక్ ఉబైద్. ఉబైద్ న్యురాలజిస్ట్, మానవ హక్కుల పరిరక్షకుడు, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC) మాజీ అద్యక్షుడు. భారత్ లోకి రోహింగ్యలను అనుమతించకపోవడంపై ఆందోళన వహించిన ఈయన భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాలుపడుతోంది ఆ దేశాన్ని బ్లాక్ లిస్ట్ లో వుంచాలి అని USCIRF పై వత్తిడి తేవడానికి IMAC నిధులు సేకరించి FGR అనే లాబీ సంస్థకు ఇచ్చింది. ఈ FGR సంస్థ అధినేత టెర్రీ అలెన్ USCIRF అద్యక్షుడు నదినే మయింజా చాలా కాలంగా దగ్గర సంబంధాలు వున్నాయి..
IMAC ప్రస్తుత అధ్యక్షుడు రషీద్ అహ్మద్ గతంలో అంటే 2008-17 కాలంలో IMANA అంటే ఇస్లామిక్ మెడికల్ అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేశాడు. ఈ IMANA డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా ప్రస్తుతం పని చేస్తున్న జహిద్ మహమ్మద్ పాక్ మాజీ నేవల్ అఫిసర్.
భారత్ మీద కుట్రలు చేయడానికి పాక్ అమెరికాలో ఎంత పకడ్బందీగా నెట్ వర్క్ తయారుచేసుకుందో చూడండి.
ఈ సోది అంతా ఎందుకు అంటే గత వారం లో ఈ జమాతే ఇస్లామీ మోడీ ప్రభుత్వం వచ్చాక భారత్ లో ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయో, మైనార్టీలకు రక్షణ ఏ విధంగా కరువైందో చర్చించడానికి ఒక వర్చ్యుయల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనిలో పైన చెప్పిన సంస్థల సభ్యులతో పాటు భారత్ అంటే ఎప్పుడూ ద్వేషం చిమ్మే అమెరికన్ కాంగ్రెస్ కి చెందిన నలుగురు సభ్యులు మరీ ముఖ్యంగా భారత్ నుండి మన గౌరవనీయ మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా పాల్గొన్నారు.
ఆ కాన్ఫరెన్స్ లో వక్తలు అందరూ భారత్ పై విషం చిమ్మితే మన అన్సారీ గారు కూడా భారత ప్రజల టాక్స్ డబ్బులతో సర్వసుఖాలు అనుభవిస్తూ అదే భారత్ పై పాక్ పరోక్షంగా ఏర్పాటు చేసిన సదస్సులో విషం కక్కారు.
ఈయన ఇలా దేశ ద్రోహం కార్యకలాపాలకు పాల్పడం మొదటి సారి కాదు. గతంలో ఈయన 1990-92 మధ్యలో ఇరాన్ దేశంలో భారత రాయబారిగా పనిచేస్తున్నప్పుడు భారత నిఘా సంస్థ RAW అధికారుల వివరాలు బయటపెట్టారు అని అప్పటి RAW అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
అన్నట్లు ఈ హమీద్ అన్సారీ మేనల్లుడు ఉత్తరప్రదేశ్ ప్రముఖ డాన్ ముక్తార్ అన్సారీ. ఇతను సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ కుడి భుజం. రేపు యుపిలో అఖిలేష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ అన్సారీ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుంది.
ఇటువంటి వారినందరినీ కాంగ్రెస్ సెక్యులరిజం పేరుతో పెంచి పోషించి ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టింది.
Courtesy :- Chada Shastry