గ్రేటర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ పోగొట్టుకున్నట్టైంది. అక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ విజయం సాధించారు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్కడినుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ్నుంచి పోటీ పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తూ పలువురు బీజేపీ నేతలు మంత్రి కేటీఆర్ ను కలిశారు. దీంతో టీఆర్ఎస్ పోటీలోలేదు. అయితే బీజేపీ నాయకులు కేటీఆర్ ను కలవడంపై పార్టీలో కలకలం రేగింది. దానిపై పార్టీ చీఫ్ సంజయ్ నాయకులపై మండిపడుతూ చర్యలకు సిద్ధమయ్యారు. విచారణ కమిటీని సైతం వేశారు. పోటీ చేసి ఆ స్థానాన్ని గెలుచుకుంటామన్న కమలం పార్టీ ఆశలు అడియాసలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. అటు ఈ విజయంలో బల్దియాలో కాంగ్రెస్ పార్టీబలం మూడుకు చేరింది.