కాంగ్రెస్.. మజ్లిస్ స్నేహం బట్టబయలు..!
……………
అప్పట్లో ముస్లిం లీగ్ తో అంట కాగిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అదే వారసులతో స్నేహం కొనసాగిస్తోంది. తెలంగాణ గడ్డమీద మజిలీస్ పార్టీ ని నెత్తి మీద పెట్టుకుని మోస్తోంది. కొన్నిసార్లు కాంగ్రెస్ ను .. మజిలీస్ పార్టీ దూరం పెట్టి,, చీకొట్టినా కానీ .. హస్తం పార్టీ మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. తిరిగి మజ్లిస్ వెంట నడిచేందుకు తహతహ లాడుతుంది.
……..
హైదరాబాద్ వేదికగా మజిలీస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. వక్స్ బోర్డు సవరణలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేందుకు ఈ సభ పెట్టారు. ఊహించినట్లుగానే ఈ సభా వేదిక నుంచి మజ్లిస్ నాయకులు ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. ముస్లిం మైనారిటీల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు.
………..
మజ్లిసు సభలో ప్రసంగాల సంగతి పక్కన పెడితే, ఈ సభ కోసం ఏర్పాట్లు భారీగా జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించింది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు సభ పెడితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు., కనీసం సభకు పెద్దగా జనం రాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు పెడతారు. కానీ మజ్లిసు సభ కోసం పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వ్యవస్థ కూడా పూర్తిస్థాయిలో సహకారం అందజేసింది. ఒక రకంగా ప్రభుత్వ కార్యక్రమం అన్న తరహాలో స్థానిక యంత్రాంగం పనిచేసింది.
…………….
తెలంగాణలో హోం శాఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చినందుకే పోలీసు యంత్రాంగం ఈ స్థాయిలో సహకారం అందించింది అని అర్థమవుతుంది. మజ్లిస్ సభను విజయవంతం చేసే బాధ్యతను ఆ పార్టీ కార్యకర్తలు కన్నా … కాంగ్రెస్ పార్టీయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని తెలుస్తుంది.
…..
వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ అడ్డాగా మార్చింది కాంగ్రెస్ పార్టీయే. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు… పాత బస్తి నియోజకవర్గాలను గంప గుత్తగా తయారుచేసి మజ్లిస్ కి అప్పగించారు. ఇప్పుడు కూడా పాత బస్తీని మజ్లిస్ కు రాసి ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం గమనార్హం. దీనిని బట్టి కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల అక్రమ సంబంధం స్పష్టంగా అర్థమవుతుంది.