హిందూ దేవీ దేవతలను అవమానించడం, దేవాలయ వ్యవస్థల మీద దాడులు చేయడం ఇటీవల బాగా పెరిగిపోయింది . సంస్కృతికి మూలం అయిన దేవాలయ వ్యవస్థలను నాశనం చేస్తే…. మన హైందవ సమాజాన్ని పూర్తిగా దెబ్బ కొట్టొచ్చు అనేది ఆలోచన. ఇందుకు తగినట్లుగానే ఇటీవల కాలంలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు, దేవాలయాల చుట్టుపక్కల దురాక్రమణలు బాగా పెరిగిపోతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నాయకుల బుర్ర లో కొత్త ఆలోచన వచ్చి చేరింది. దేవాలయాల్లో దేవి దేవతలకు భక్తులు సమర్పించిన బంగారాన్ని అమ్మేసుకుందామని ప్రతిపాదన చేస్తున్నారు. దేశంలోని దేవాలయాల ఆస్తులు, నగలను అమ్మేసినట్లయితే .. దేవాలయ వ్యవస్థ మొత్తం గా నిర్వీర్యం అవుతుందన్నది ఈ కుట్ర. విదేశీ పాలకుల దండయాత్రలో అందుచేతనే దేవాలయాల్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే మోడల్ వైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
వచ్చే జనవరిలో ప్రయాగ రాజ్ కేంద్రంగా మహా కుంభమేళా జరగబోతోంది.
లక్షల మంది వచ్చే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైందవ సమ్మేళనం పండగలకు ఈ ఖర్చు ఎందుకని విమర్శలు మొదలు పెట్టింది. ఈ అంశం మీద టైమ్స్ నౌ అనే ఛానల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోయారు.
కమ్రుజున్ చౌదరి అనే కాంగ్రెస్ నాయకుడు ఒక అడుగు ముందుకేసి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దేవాలయాలకు ఆస్తులు నగలు ఎందుకని సూటిగా ప్రశ్నించారు.. ఈ ఆస్తులు నగలు అమ్మేస్తే భారతదేశం అప్పు తీరిపోతుందని నమ్మబలికారు. చర్చలో పాల్గొన్న ఇతర నాయకులు ఈ వాదనని అడ్డుకున్నారు. అటువంటి అప్పుడు వక్ఫ్ భూములు కూడా అమ్మేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందా అని ప్రశ్నించడం జరిగింది. దీనికి మాత్రం సదరు కమ్రూ చౌదరి నో చెప్పారు. వక్ఫ్ బోర్డు భూములను ఆస్తులను ఏమాత్రం ముట్టుకోకూడదని స్పష్టం చేశారు. దేవాలయ ఆస్తులు నగదు అమ్మేయాలన్నదే తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు.
కమ్రూ చౌదరి వాదనను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఖండించలేదు. దీంతో ఆయన ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనగానే భావిస్తామని బిజెపి చెబుతోంది. బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి దీని మీద స్పందిస్తూ… హైందవ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటని మండిపడ్డారు. దేవి దేవతల దేవాలయాల ఆస్తులు జోలికి వస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.
మొత్తం మీద దేవాలయాల ఆస్తులు నగదు అమ్మేయాలి అన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.