హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్‌లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్‌లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక్ జిహాద్ తో హిందుత్వను పోల్చడం హేయమైన చర్య అని పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఇది కాంగ్రెస్ నిజమైన ఆలోచనను ప్రతిబింబిస్తోందన్నారు.
”సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్” అనే పేరుతో సల్మాన్ ఖాన్ రచించిన తాజా పుస్తకాన్ని ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోనే 113వ పేజీలో ఆయన హిందుత్వను ఐఎస్ఐఎస్, బొకో హరామ్‌తో పోల్చారు.
”సనాతన ధర్మం, సాధువులు, బుషులు చెప్పిన క్లాసికల్ హిందూయిజాన్ని… హిందుత్వ వెర్షన్ పక్కన పెట్టేసింది. హిందుత్వ రాజకీయ వెర్షన్ ప్రమాణాలు ఐఎస్ఐఎస్, బొకోహరాం రాజకీయ వెర్షన్ ప్రమాణాలకు సామీప్యం ఉంది” అని సల్మాన్ ఖుర్షీద్ అందులో పేర్కొన్నారు.
అటు సల్మాన్ ఈ వ్యాఖ్యలపై ఢిల్లీకి చెందిన వివేక్ గార్గ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు.