కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వక్ఫ్ బోర్డు దూకుడు పెంచుతోంది. ప్రభుత్వ పక్షాల నుంచి మద్దతు ఉండడంతో తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు లాగేసుకుంటున్నది. కర్ణాటకలో పరిస్థితి మరి దారుణంగా ఉంది. ప్రతి చోటా వందల ఎకరాల భూమిని లెక్క వేసుకుని,, రాత్రికి రాత్రి వక్ఫ్ బోర్డు ఆస్తి అంటూ బోర్ పెట్టేస్తున్నారు . దీని మీద బాధితులు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కల్బురిగి, శివ మొగ్గ వంటి ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలను వక్ఫ్ బోర్డు లాగేసుకుంటున్నది.
ఈ చర్యలు విస్తృతమైన నిరసనలకు దారితీశాయి, రైతులు మరియు స్థానిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఈ అంశం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ప్రజల ఆగ్రహం పెరుగుతున్నప్పటికీ,, తాము ఎలాంటి తప్పు చేయలేదని సీఎం సిద్ధరామయ్య ఖండించారు, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి)పైనే నిందను మోపారు. అయితే, నిరసనల స్థాయిని బట్టి ఈ వివాదం ముదిరి పాకాన పడుతుందని, వక్ఫ్ బోర్డు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని పలువురు అభిప్రాయ. పడుతున్నారు.
హిందువుల భూమిని స్వాధీనం చేసుకునే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం”ల్యాండ్ జిహాద్” చేస్తోందని బిజెపి ఆరోపిస్తోంది . న్యాయం జరిగే వరకు నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అల్టిమేటం ఇచ్చారు. ఇటీవలి వారాల్లో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు వక్ఫ్ బోర్డుకు బదిలీ చేయబడిందని, తరచుగా నోటీసులు లేదా విచారణలు లేకుండానే స్వాధీనం చేసుకొంటున్నారని బిజెపి పేర్కొంది. వక్ఫ్ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కేవలం 15 రోజుల వ్యవధిలో యాజమాన్యాన్ని ధ్రువీకరించకుండానే వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు పాల్పడుతోందని వారు వాదిస్తున్నారు.
ఈ సమస్య కర్ణాటకలోని 10కి పైగా జిల్లాల్లో విస్తృత నిరసనలకు దారితీసింది, రైతులు మరియు కార్యకర్తలు తమ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాలలో, రైతులు తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు అక్రమంగా స్వాధీనపరచు కున్నారని వారు అభివర్ణించిన దానికి వ్యతిరేకంగా వేలాది మంది ఉద్యమిస్తూ నిరసనగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరసనలు పెద్ద ఎత్తున పెరిగాయని, సమస్య పరిష్కారమయ్యే వరకు బాధిత రైతుల పక్షాన ఆందోళన కొనసాగిస్తామని బీజేపీ స్పష్టం చేసింది.
అయినప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం మొండి వైఖరితోనే ఉంది. దీంతో కర్ణాటకలో పరిస్థితి ఎలా అవుతుందనేది ఉత్కంఠ గా మారింది.