చనిపోయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం మీద కూడా కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడింది. శవ రాజకీయాలతో జాతీయస్థాయిలో పేరు గడించాలని ప్రయత్నం చేసి విఫలమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అన్న ప్రయత్నం బెడిసిగొట్టింది.
యమునా నది ఒడ్డున ఉన్న రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. అయినప్పటికి ప్రభుత్వం స్పందించడం లేదని దుష్ప్రచారం మొదలుపెట్టేసారు.
రాజ్‌ఘాట్‌లో ఒక్కొక్కరికీ ప్రత్యేక స్మారక స్థలం ఏర్పాటు చేసేందుకు స్థలం సరిపోనందువల్ల.. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో మాజీ ప్రధానుల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని 2013లో మన్మోహన్ సింగ్ అధ్యక్షతనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు రాజ్‌ఘాట్‌లో ప్రత్యేక స్మారక స్థలం కావాలని కాంగ్రెస్ పార్టీ స్వయంగా కోరడం గమనార్హం.
మరో విషయాన్నీ కూడా గమనించాలి. నెహ్రూ-గాంధీ కుటుంబం వెలుపల ఉన్న ప్రముఖులను విస్మరించి, దేశానికి వారు చేసిన సేవలను తక్కువగా చూపిస్తున్నారని తరచుగా ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు మరణం తర్వాత ఆయనను అవమానించారు.
1996లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పీవీ ను దూరంగా ఉంచింది. భారతదేశంలో జరిగిన అతిపెద్ద సంస్కరణ అయిన భారత ఆర్థిక వ్యవస్థను తెరవడంలో రావు పాత్రను కాంగ్రెస్ సంవత్సరాలుగా అంగీకరించలేదు. నెహ్రూ-గాంధీ కుటుంబం వెలుపల పూర్తి పదవీకాలం పూర్తి చేసిన మొదటి ప్రధానమంత్రి రావు. రాజధానిలో ప్రత్యేక స్మారక స్థలం లేని ఏకైక కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు.
ఒకరకంగా పీవీని బిజెపియే గౌరవించింది అనుకోవచ్చు.
ఆయన మరణించిన 10 సంవత్సరాల తర్వాత, బీజేపీ హయాంలో ఆయనకు స్మారక చిహ్నం ఢిల్లీలో లభించింది. ఏక్తా స్థల్ సమాధి కాంప్లెక్స్ వద్ద రావు కోసం ఒక స్మారక ఘాట్‌ను నిర్మించింది.
అంతేకాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం పివి నరసింహారావుకి భారతరత్న పురస్కారం అందించింది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు.
తాజాగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియల మీద వివాదం చేసేందుకు కాంగ్రెస్ విఫల ప్రయత్నం చేస్తుంది. అంతా నిర్ణయించినట్లుగానే యమునా అనేది ఒడ్డున నిగమ్ బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.