భారతీయులు ఎక్కువ గా ఇష్టపడే క్రికెట్ మీద, క్రికెటర్ల మీద కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయాలు చేస్తోంది. ఇటీవలే పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్ ఆటగాళ్లకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇది తట్టుకోలేని కొందరు కాంగ్రెస్ నేతలు.. భారతీయ క్రికెటర్ల మనోస్థైర్యం దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ మీదనే చౌకబారు వ్యాఖ్యలకు దిగారు. రోహిత్ శర్మ లావుగా ఉంటున్నాడు అని, స్మార్ట్ గా లేనందున కెప్టెన్ గా పనికి రాడంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శామా మహ్మద్ వ్యాఖ్యలు చేశారు. దీని మీద సోషల్ మీడియాలో దుమారం రేగింది. అయినప్పటికీ ఆమె ఏమాత్రం తగ్గటం లేదు. క్రికెటర్ల ఫిట్ నెస్ మీద తాను కామెంట్ చేశానంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతల వైఖరిని అంతా ఖండిస్తున్నారు. బీసీసీఐ కూడా ఈ వ్యాఖ్యలను తప్పు పట్టింది. మరో వైపు, కాంగ్రెస్ నేతల మీద నెటిజన్లు వెరైటీగా విరచుకు పడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా రాజకీయాల్లో ఫిట్ గా లేరని, అందుచేత ఆయన కెప్టెన్ గా పనికి రారు అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.