వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. పార్టీ నుంచి ఓ అసెంబ్లీ స్థానానికి బరిలో ఉన్న ఓ అభ్యర్ధి కరోనా కాటుతో మరణించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో విషాదం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ పరిధిలోని సమ్పేర్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రిజావుల్ హక్ బరిలో ఉన్నారు. అయితే ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని బెంగాల్ కాంగ్రెస్ కార్యదర్శి రోహన్ మిత్ర మీడియాకు తెలియజేశారు.