కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అధినేత్రి సోనియా గాంధీ జెండాను ఎగురవేయబోతుంటే… దారం తెగింది. సోనియా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్న దృశ్యాల్ని కింది వీడియోలో మీరు చూడవచ్చు. అక్కడ సహాయకుడిగా ఉన్న వ్యక్తి తాడును గట్టిగా లాగడంతో తెగి జెండా పడిపోయింది. కింద పడబోతున్న జెండాను సోనియాగాంధీ చేతులతో అందుకున్నారు. తరువాత తిరిగి తాడును సిద్ధం చేయడానికి చాలా సమయమే పట్టింది. దాన్ని కవర్ చేస్తున్నారా అన్నట్టు అక్కడున్న వారంతా పెద్దఎత్తున కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఇక ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోను తొలగించాలని కాంగ్రెస్ మద్దతుదారులు కోరుతుంటే… పార్టీ జెండానే సరిగా ఎగురేయలేనివాళ్లు దేశాన్నేం ఏలుతారని చాలామంది సెటైర్లు వేశారు.
ఇక కాసేపటికే సోషల్మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ ప్రత్యక్షమయ్యాయి. అమిత్ షా, మోదీ ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుతున్న ఫొటోను చాలమంది షేర్ చేశారు. ఇక పార్టీ పనంతే అనే అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ టాటా బైబై చెబుతున్నట్టు మీమ్స్ హల్ చల్ చేశాయి.