లౌకికవాదం పేరుతో జరుగుతున్న కుట్రలో మరో కోణం బయటపడింది. సున్నితమైన అంశాలకు సంబంధించిన పార్లమెంటు కమిటీలలో కాంగ్రెస్ కూటమి ఉద్దేశపూర్వకంగా ముస్లింలనే నియమిస్తోంది. సహజంగానే ఈ చర్యతో కాంగ్రెస్ కూటమి నిర్ణయాల మీద వాదోపవాదనలు చోటు చేసుకుంటున్నాయి.
వక్సు బోర్డు సవరణల సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అయింది. దీని మీద అధ్యయనం కోసం ఆయా పార్టీలు తమకు సంబంధించిన ఎంపీల పేర్లను ఇవ్వాలి. తాజాగా ఢిల్లీలో పార్లమెంటు సంయుక్త కమిటీ సమావేశం అయింది. ఈ కమిటీ కోసం ప్రతిపక్ష పార్టీలు అచ్చంగా ముస్లింలనే ప్రతినిధులుగా పంపించాయి. దీంతో ప్రతిపక్ష పార్టీల వాదనలుగా ముస్లిం సభ్యుల వాదనలు చలామణి అయిపోవడం తేలికగా మారుతుంది. ఈ కమిటీలో
కాంగ్రెస్ పార్టీ నుంచి నజీర్ హుస్సేన్ మహమ్మద్ జావేద్, మజిలీస్ పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్వాది పార్టీ నుంచి మొహీబుల్లా, టీఎంకే నుంచి మహమ్మద్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ హక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఊహించినట్లుగానే పార్లమెంటరీ కమిటీ సమావేశం కాగానే, ముస్లిం సభ్యులు అంతా గొడవ పడడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ స్కెచ్ కు అనుగుణంగా దీని మీద భిన్నమైన రూపంలో వార్తలు బయటకు వచ్చాయి. పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్షాల నిరసన, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్న అధికార కూటమి, ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
మొత్తం మీద లౌకికవాదం ముసుగులో కొంతకాలంగా జరుగుతున్న రాజకీయం మరోసారి ఇక్కడ రిపీట్ అయింది. దీంతో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే పార్లమెంటరీ కమిటీ వాయిదా పడింది. వక్ఫ్ చట్టంలో సవరణలు రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూటమి వ్యూహాత్మకంగా ఈ మార్గాన్ని ఎంచుకుంది అని అర్థం అవుతోంది.