రామాయణం జరిగింది అని మరోసారి నిర్ధారణ అయింది . రామాయణంలో చెప్పిన రామసేతు వంతెన అనేది వాస్తవం అని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. భారత్ శ్రీలంక మధ్య సముద్రంలో రామసేతు ఉంది అని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించే మ్యాపులు ఫోటోలు విడుదల చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు కొంతకాలంగా దీనిమీద పరిశోధన చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఐస్‌శాట్ – 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెన పూర్తి వివరాలు వెలికి తీశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి … శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకూ విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
రామసేతు మీద చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి అనేక రహస్యాలు దాగి ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు.
ఈ రహస్యాల ఛేదనలో ఇస్రో మరో మైలురాయిని చేరింది. నాసాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తొలిసారిగా ఆడమ్ బ్రిడ్జిగా పిలిచే రామసేతు మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్‌లో మొత్తం వంతెన కనిపిస్తుండడం విశేషం. ఇస్రో అమెరికాకు చెందిన ఉపగ్రహం ఏస్‌శాట్-2 డేటాను వినియోగించి ఈ మ్యాప్‌ను రూపొందించింది. అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు.
రామాయణం లో రామసేతు గురించి స్పష్టమైన వివరణ ఉన్నది. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మ అమ్మవారిని అపహరించాడు. ఆమెను అక్కడే ఉంచాడు. హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రంపై ఈ వంతెనను వానరసేన నిర్మించింది. ఆ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. ఆ తర్వాత యుద్ధంలో రావణుడిని ఓడించి సీతమ్మవారిని వెనక్కి తెచ్చుకొనడంతో రామాయణం ముగిసింది.
త్రేతా యుగం పూర్తి అయిన తర్వాత ద్వాపరయుగం మరియు కలియుగంలో కూడా రామసేతు అలాగే నిలిచి ఉంది., క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధై’ గా పిలుస్తుండే వారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1480 దాకా పటిష్టంగానే ఉంది కానీ ఆ సమయంలో వచ్చిన భయంకర తుఫానులతో ధ్వంసమైంది. అంతకు ముందు సముద్రమట్టానికి పైనే ఉండేది కానీ తుఫానులతో శిధిలం కావడంతో సముద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ కూడా సముద్రం లోపల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
మొత్తం మీద ఇస్రో పరిశోధనలు, మ్యాపులు, ఫోటోలు సహాయంతో రామాయణం పూర్తిగా వాస్తవం అని మరోసారి నిర్ధారణ అయింది.