కరోనా వ్యాప్తికారణంగా శ్రీవారి దర్శనాలను కుదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశదర్శనం టిక్కెట్ల కోటాను సగానికి సగం తగ్గించింది. అయితే ఇప్పటికే టిక్కెట్ పొందిన భక్తులు దర్శన తేదీకి రాలేకపోతే టిక్కెట్ పొందిన 90 రోజుల్లో ఎప్పుడైనా స్వామిని దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మే నెలకు సంబంధించి బుధవారం ఆన్లైన్లో టీటీడీ ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది. అయితే టిక్కెట్లను 30 వేల నుంచి 15 వేలకు కుదించనున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే దర్శనాల సంఖ్యను మరింత కుదించే అవకాశాలున్నాయి.