మహానవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే పై కేసు నమోదైంది. ఔరంగాబాద్‌లో మే 1న జరిగిన బహిరంగ సభలో MNS చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన ప్రసంగంపై పలువురు ఫిర్యాదు చేశారు. ఔరంగాబాద్‌లో దాఖలైన ఎఫ్ఐఆర్లో సభ నిర్వాహకుల పేర్లు కూడా ఉన్నాయి. సభలో ఠాక్రే తన మద్దతుదారులను మే 4 వరకు మసీదులలో లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే మసీదుల బయట హనుమాన్ చాలీసాను ప్లే చేయాలని పిలుపునిచ్చారు.
ముంబై లోని సిటీ చౌక్ పోలీసులు ఠాక్రేపై సెక్షన్ 153, 116, 117ల కింద కేసు నమోదు చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)