ఈ క్రింద ఇచ్చిన జర్మనీ మ్యాప్ చూడండి.
దీనిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని పెద్ద జర్మన్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రదేశాలు చూపుతోంది.
జర్మనీ తూర్పు భాగంతో పోలిస్తే జర్మనీ పశ్చిమ భాగంలో వాటి ఏకాగ్రతను చూడండి, అంటే ఎక్కువ సమూహాన్ని చూడండి.
బెర్లిన్ గోడ కూలి రెండు జర్మనీల పునరేకీకరణ జరిగిన 30 సం. ల తర్వాత కూడా ఇదే పరిస్థితి అక్కడ ఉంది.
కారణం ?
పశ్చిమ జర్మనీ పెట్టుబడి దారీ విధానాన్ని అనుసరించి, పారిశ్రామిక వేత్తలను, వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను ప్రోత్సహిస్తే, తూర్పు జర్మనీ పిడివాద కమ్యునిజం సిద్దాంతాలు మరియు సోషలిజం సిద్దాంతాలు నమ్ముకొని…. నాకి పోయింది. ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. పశ్చిమ జర్మనీ సంపాదించే ఆదాయాలు మీదే తూర్పు జర్మనీ ప్రజలు ఆధారపడాలి.
అక్కడే కాదు. మన దేశంలో చూడండి. తూర్పున ఉన్న పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు దేశ పారిశ్రామిక రాజధాని. మన కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి సుమారు 35 సం.లు పాలించి యూనియన్స్ దాదాగిరి పెంచి పోషించి పారిశ్రామిక, వ్యాపార వేత్తలను బెంగాల్ నుండి తరిమి కొట్టి బెంగాల్ ని పారిశ్రామికంగా కొలుకోని విధంగా తయారుచేసి పడేశారు. ఆ తరువాత వచ్చిన మమత కూడా అదే బాటలో వెళ్తోంది.
మరి అటు పశ్చిమ భారత్ లో మహారాష్ట్ర గుజరాత్ చూడండి. పారిశ్రామికంగా ఎంతలా ఎదిగిపోయాయో!
అలాగే దక్షిణ రాష్ట్రాలలో కూడా చూడండి.. మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే పారిశ్రామికంగా వెనుక బడ్డ రాష్ట్రం కేరళ మాత్రమే. కారణం అక్కడ యూనియన్స్ వల్ల ప్రభుత్వ విధానాలు వల్ల పరిశ్రమలు
పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారు. కేరళ కాస్త ఆర్ధికంగా బాగుండడానికి ఆ రాష్ట్రానికి వస్తున్న గల్ఫ్ డబ్బులే అని గుర్తుంచుకోండి.
అలాగే పక్కా కమ్యునిస్టు దేశం చైనా కూడా పేరుకు ఎర్ర సిద్ధాంతం అని వల్లె వేస్తూ వెనుక నుండి పూర్తిగా పెట్టుబడిదారీ దేశాల కంటే ఇంకా ఎక్కువగా ఆ ఆర్థిక విధానాలు అవలంబించి ప్రపంచలో నెంబర్ టూ ఆర్థిక వ్యవస్థ గా ఎదిగి
మొదటి స్థానం కోసం ప్రయత్నిస్తోంది.
ఇక్కడ మన దేశంలో కూడా 1990 ల వరకు ఆ కమ్యునిస్టు, సోషలిస్ట్ ఆర్థిక విధానాలు అనుసరించి దేశాన్ని దివాలా అంచులకు తీసుకుపోయారు. 1990 లో వచ్చిన ఉదార ఆర్థిక విధానాలు తెచ్చిన సర్వ సుఖాలు అంటే విద్యుత్, రవాణా, గాస్, టెలికమ్యూనికషన్స్ ఇలా అన్ని అనుభవిస్తూ కూడా ఇంకా కమ్యునిజం, సోషలిజం చాలా గొప్పవి అంటూ ప్రస్తుత ప్రభుత్వాలని తిడుతూనే వుంటారు.
అంటే ఎక్కడ కమ్యునిజం వేలు
పెడితే అక్కడ సర్వ నాశనం.
కళ్ళ ఎదురుగా ఇన్ని నిదర్శనాలు కనిపిస్తున్నా మన మార్క్స్ మేధావులు ఇంకా ఆ కమ్యునిస్టు సోషలిస్ట్ ఆర్థిక విధానాలను పోగుడుతూనే వుంటారు.
COURTESY : చాడా శాస్త్రి