కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటింది. మహిళల సింగిల్స్‌లో కెనడాకు చెందిన మిచెలి లీని ఓడించి ఫైనల్ లో సత్తా చాటింది. భారత్ కు స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన పీవీ సింధు.. అదే ఊపులో రెండో గేమ్‌ను 21-13తో గెలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
సింధు తాజాగా సాధించిన స్వర్ణ పతకంతో కలిపి కామన్వెల్త్లో భారత్ ఇప్పటివరకూ 56 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సింధు స్వర్ణ పతకం సాధించడంతో అప్పటివరకూ ఐదో స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజత పతకం సాధించింది.
That Gold-winning feeling 🤩
It was only fitting that @Pvsindhu1 won India's 200th gold medal at CWG ⭐️pic.twitter.com/IzbOF2d6vZ
— Sportstar (@sportstarweb) August 8, 2022