ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కర్నాటకలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని బీజేపీ, ఈసారి పాగా వేయాల్సిందేనని కాంగ్రెస్, జేడీఎస్ తలపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఓ సామాన్య రైతు ప్రధాని పట్ల తన అభిమానాన్ని ప్రదర్శించి దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. జీ 20 సమ్మిట్ ప్రచారానికి సంబంధించి ఆర్టీసీ బస్సుపై ఉన్న మోదీ ఫొటోకు ముద్దుపెట్టి తన ఆప్యాయత చాటుకున్న ఆ రైతు కాసేపు అలాగే చూస్తూ ముచ్చటించాడు. నాకు వెయ్యి రూపాయలు వచ్చేదని..ఇప్పుడు 500 పెంచావని, ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ 5 లక్షలు వచ్చేలా చేస్తున్నావని..ఇన్ని మంచి చేస్తున్న నువ్వు ప్రపంచాన్ని జయిస్తావని మోదీ ఫొటోను చూస్తూ ఉద్వేగం చెందాడు ఆరైతు. ఆ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/MeghUpdates/status/1641460498754576385?s=20