భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ది. ఈ సందర్భంగా 75 మార్కుని గుర్తు పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. ఇందుకు వీలుగా 75 రూపాయల ఒక వెండి నాణాన్ని ముద్రిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌తో రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ నాణెంపైన, కింద 75వ రాజ్యాంగ వసంతోత్సవం అని దేవనాగరి లిపి, ఇంగ్లిష్‌ల్లో ముద్రిస్తారు. అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం, కుడివైపున 75వ వసంతోత్సవం జరుపుకొనే సంవత్సరం ముద్రించి ఉంటాయి.
త్వరలోనే ఈ నాణెం అందుబాటులోకి వస్తుంది.