అక్టోబరు 25న తమిళనాడులోని కోయంబత్తూరు బాంబుపేలుడు ఘటనకు సంబంధించి… ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ తల్కా, మహ్మద్ అజరుదీన్, మహ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహ్మద్ నవాజ్ ఇస్మాయిల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు కోయంబత్తూరు పోలీసులు తెలిపారు. ఘటనలో చనిపోయిన డ్రైవర్ ముబిన్ కు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
ఆదివారం తమిళనాడు కోయంబత్తూర్ లో కొట్టాయ్ మేడు ప్రాంతంలో ఒక దేవాలయం దగ్గర కార్లో ఒక గాస్ సిలిండర్ పేలి డ్రైవర్ చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం దేవాలయం వద్ద ఒక పోలీస్ చెక్ పోస్ట్ వుంది అక్కడకు రాగానే కార్ స్పీడ్ పెరగడం, పేలుడు జరగడం ఒక సారే సంభవించాయి, దేవాలయానికి యెటువంటి హాని జరగలేదు, దేవాలయ బోర్డ్ మాత్రం ధ్వంసం అయింది అని చెప్పారు. బ్లాస్ట్ జరిగిన కారులోనూ ఆ చుట్టుపక్కల ఇనుప మేకులు, గోళీకాయలు దొరకడంతో ఇది టెర్రరిస్టుల పని ఏమో అని ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
ఎందుకంటే, అతని కారులో ఉన్న ఇనుప మేకులు పేలుడు సమయంలో ఎక్కువ మంది జనాలు గాయపడడానికి, వీలైనంత ఎక్కువ నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారనడానికి సంకేతం. అటువంటి పేలుళ్లలో ప్రాణాలతో బయటపడిన వారు దారుణమైన మరియు అత్యంత బాధాకరమైన మరణాన్ని పొందేలా ఈ మేకులు పని చేస్తాయి. అందుకే ఇది ఉగ్రవాదుల దాడి అని అనుమానించారు.
పేలుడులో చనిపోయిన డ్రైవర్ మృత దేహం గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో వేరే మార్గాల ద్వారా అతన్ని గుర్తిస్తే అతని పేరు జమీషా ముబిన్ అని టెర్రరిస్టులతో సంబంధం వుంది అనే అనుమానంతో గతంలో అంటే 2019లో NIA ఒకసారి ఇతడిని విచారించి నట్లు తెలిసింది. అతని ఇంటిపై చేసిన దాడిలో బాంబు తయారు చేయటానికి కావలసిన ముడిపదార్ధాలు ఇతర వస్తువులు పోలీసులు కనుక్కున్నారు.
ముబిన్‌పై పెండింగ్‌లో ఏవీ పోలీసు కేసులు లేకపోయినా, అతను ఏదో ఒక గ్రూపులో భాగమని తెలియకపోయినా, అతను పోలీసు రాడార్‌లో ఉన్న కొంతమంది వ్యక్తులతో పరిచయం కలిగి ఉన్నాడని పోలిసుల ప్రాధమిక దర్యాప్తు లో తేలింది. ముబిన్ పూర్వాపరాలు, కారు యజమాని వివరాలు, ఎల్పిజి సిలిండర్ల విషయం వంటి వివిధ కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పాల వ్యాపారి, కిరాణా వ్యాపారి, సంగమేశ్వర ఆలయ పూజారులు, మందిరంలో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలతో సహా కొంతమంది స్థానికులను కూడా పోలీసులు విచారించారు.
ఆలయానికి సమీపంలో ఈ పేలుడు జరిగింది. ముబిన్ నివాసంలో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, సల్ఫర్ మరియు బొగ్గు వంటి పేలుడు పదార్థాలను పరిశోధకులు కనుగొన్నారు. పొరపాటున జరిగిన పేలుళ్లు కావని నిర్ధారించారు. ఆ కారు ఓనర్, ఉగ్రవాది జమేషా ముబిన్ ఇంటి నుండి పొటాషియం నైట్రేట్, సల్ఫేట్ వంటి అనేక పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి.
Tamil Nadu | We have arrested five people in this matter. Case filed, UAPA invoked: V Balakrishnan, Coimbatore CP on Coimbatore car blast case pic.twitter.com/gxj9m9yoQb
— ANI (@ANI) October 25, 2022
ముబిన్ తన ఫోన్ డిస్ప్లే ఫోటోపై, “నా మరణ వార్త మీకు అందితే, నా తప్పులను మన్నించండి, నా లోపాలను దాచుకోండి, జనాసాలో పాల్గొనండి మరియు నా కోసం ప్రార్థించండి” అని ఉండడాన్ని గుర్తించాడు. చనిపోయిన ముబిన్‌కు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్టు విచారణలో తేలింది. కొన్నేళ్లక్రితం ఈస్టర్ పండగ సందర్భంగా శ్రీలంకలో జరిగిన బాంబుపేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్న అజహర్‌తో పాటు…ఆత్మాహుతి బాంబర్ల నాయకుడు జహ్రాన్ హషీమ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయనంటున్నారు. శ్రీలంక తరహా దాడులకు ఈ గ్యాంగ్ కుట్ర పన్ని ఉంటుందని భావిస్తున్నారు. కొన్నియమ్మన్ ఆలయం లేదా కొట్టా ఈశ్వరన్ ఆలయం నుండి ప్రారంభించాలని ప్లాన్ చేసి ఉండవచ్చంటున్నారు. అసలైతే అతను తమిళనాడు పోలీసుల టార్గెట్ లిస్టులో ఉన్నాడు.అయితే సరైన ఆధారాల్లేక అరెస్ట్ చేయలేదు. ఐసిస్ తో సంబంధాలుండి..ప్రస్తుతం కేరళ జైల్లో ఉన్న మరికొందరితో కూడా సంబంధాలున్నట్టు సమాచారం.
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల తరువాత అనేకమంది తమిళ, కేరళ యువకులను రిక్రూట్ చేసుకుని ఆకేసులో అరెస్టయ్యారు కొందరు. ఇస్లామిక్ స్టేట్ తమిళనాడు యూనిట్లో ఓ ముఖ్యుడు కూడా అందులో ఉన్నాడు.
ఈ ఘటన తర్వాత తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కె అన్నామలై ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని, ఇస్లామిక్ స్టేట్‌తో బంధంతో ప్రణాళికాబద్ధంగా జరిగిన ఉగ్రదాడి అని పేర్కొన్నారు. తమిళనాడులోని డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెడుతోందని ఆయన అన్నారు.
On Oct 21, Jamesha Mubin posted a WhatsApp status similar to that of ISIS. Police haven't said why they have arrested 5 people. On behalf of TN BJP, we've written a letter to Union Home Minister regarding this blast. Police have to accept this as a 'suicide attack': K Annamalai
— ANI (@ANI) October 25, 2022