బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ విమానాశ్రయానికి రాకపోవడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.
కేసీఆర్ ఒక గౌరవమైన హోదాలో ఉన్న వ్యక్తిని, అలాగే ఒక సంస్థను అవమానించారని అన్నారు.
“ఆయన రాజ్యాంగ సమగ్రతను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. కేసీఆర్ పార్టీకి రాజకీయాలు ఒక సర్కస్ కావచ్చు, కానీ బీజేపీ కార్యకర్తలకు, రాజకీయాలంటే దేశ నిర్మాణానికి మాధ్యమం” అని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అధికారిక పర్యటనకు వచ్చిన ప్రధానిని స్వీకరించడంలో కేసీఆర్ ప్రొటోకాల్ పాటించకపోవడం ఆరు నెలల్లో ఇది మూడోసారి.
Telangana CM KCR just not insulted an individual but also an institution. He jeopardised integrity of the constitution. Politics maybe a circus for KCR's party, but for BJP workers it is a medium for social emancipation and nation-building: Union min Smriti Irani in Hyderabad pic.twitter.com/eiVzHeyMJ1
— ANI (@ANI) July 2, 2022
ప్రధాని మోదీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ప్రధానిని ఆహ్వానించని కేసీఆర్ నిర్ణయంతో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ మొదలైంది.
స్మృతి ఇరానీ కంటే ముందు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్రావు మాట్లాడుతూ.. ‘ప్రధాని లేదా రాష్ట్రపతి.. రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని రిసీవ్ చేసుకోవాలి, అదే ప్రోటోకాల్.. దానిని ఉల్లంఘించడం సరికాదని, ప్రధానిని గౌరవించాలి” అని అన్నారు. ఆయన బీజేపీకే కాదు దేశానికి ప్రధానమంత్రి. తెలంగాణ సీఎం ప్రధానిని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు అని అన్నారు.
“ప్రోటోకాల్ ప్రకారం, ఒక రాష్ట్ర ప్రతినిధి వెళ్లి ఆహ్వానించాలి. కాబట్టి నేను మంత్రిగా ప్రధానిని స్వీకరించడానికి అక్కడికి వెళుతున్నాను” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.