రిపబ్లికన్ నేతలు క్లింటన్ అబద్దాలు ఆడుతుందని, పొంతన లేని పత్రికా ప్రకటనలు ఇచ్చిన విధానం చుస్తే చాలా విషయాలు ఆవిడ కప్పిపెడుతున్నారని ఒక దర్యాప్తు కోసం అడిగారు. ఎందుకంటే పరిస్తితి విషమిస్తున్నదని, తన ప్రాణాలకు రక్షణ లేదని రాయబారి స్తేవేన్స్ డిపార్టుమెంటు of స్టేట్ కి సందేశాలు పంపాడు. వాటిని హిల్లరీ పట్టించికోలేదని వారి ఆరోపణ. పాకిస్తాన్లో అర్ధ రాత్రి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి బిన్ లాడెన్ ని చంపివేసిన అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ నేవీ సీల్స్ కి బెంగాజి లోని అమెరికా రాయబారి స్తేవేన్స్ ని రక్షించి తీసుకొని రావటం పెద్ద విషయం కాదు. అలాంటిది వారి రాయబార కార్యాలయం పై దాడి చేసి మొత్తం సిబ్బందిని చంపటం కేవలం చేతకాని విదేశాంగ మంత్రిణి వల్ల జరిగిందని, దానిపై దర్యాప్తు చెయ్యాలని వారు ప్రెసిడెంట్ ఒబామాని కోరారు.
హిల్లరీక్లింటన్ అమెరికా ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన ఈమెయిలు వాడకుండా తన స్వంత ఈమెయిలు ప్రభుత్వ పనులకు వాడింది. ఆవిడ పంపించిన ఈమెయిళ్ల డేటా ప్రభుత్వం వద్దలేదు. ఆ ప్రైవేటు ఈమెయిలు సేవ అందిస్తున్న సంస్థ వాటిని దర్యాప్తు ప్రారంభం కాగానే డిలీట్ చేసింది. ఆవిడ ఫోన్ లను సుత్తితో కొట్టి ఫోన్లో వున్న ఈమెయిలు సాక్ష్యం దొరకకుండా చేసారు. గత సంవత్సరం అధ్యక్ష ఎన్నికలలో ఆవిడ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఈమెయిళ్ళ వ్యవహారాన్ని వాడుకొని హిలరి దేశానికి ద్రోహం చేసిందని ప్రచారం చేసాడు. తనని గెలిపిస్తే ఆవిడని జైల్లో పెడతానని ఎనికల్లో వాగ్దానాలు చేసాడు.
మరొక క్లింటన్, హిల్లరీ భర్త బిల్ తను ప్రెసిడెంట్ గా వున్నప్పుడు మోనికా లేవిన్స్కితో శృంగారం అదికూడా అధికార భవనమైన వైట్ హౌస్ లో చేసాడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన అమెరికన్ ప్రెసిడెంట్ పదవిలో వుండి, అధికార గృహంలో తనకన్నా పాతికేళ్ళకన్నాచిన్నదైన ఒక యువతితో శృంగారం జరపటం కేవలం కామంతో కళ్ళుమూసుకు పోయినవాడే చేయగలడు. మోనికా మాత్రం క్లింటన్ తనను ప్రేమిస్తున్నాడని ఆయనతో ఈ సంబంధం పెట్టుకున్నది.యువత వయసులో వున్నప్పుడు ప్రేమ తప్ప మరోటి ఆలోచించరు. ఆవిడ తనకోసం క్లింటన్ హిల్లరిని వదిలివేస్తాడని అనుకుంది. పరిణితిలేని వయసు వల్ల వచ్చిన ఆలోచనలు కన్నకలలు ఎప్పుడైతే క్లింటన్ ఆమెని కేవలం శారీరక సుఖానికి వాడుకున్నడన్న విషయం అర్థమయ్యిందో అప్పుడు చెదిరిపోయాయ. జరిగిన సంగతి బయటకు వెళ్లి చెప్పుకోలేదు. బయటకు వెళ్లి చెప్పినాకూడా వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ తో శృంగారం లాంటి విషయాన్నీ ఎవ్వరు నమ్మరు. మనసులో దాచుకోలేక తన బాధను లిండా ట్రిప్ అనే మరొక సహోద్యోగితో చెప్పుకుంది. లిండా రహస్యంగా మోనికా చెప్పిన విషయాలన్నీ రికార్డు చేయటం మొదలుపెట్టింది.
ఆ ఒక్క సాక్షం చాలు కెన్ స్టార్ కీ, తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, మోనికాకు క్లింటన్ పంపించిన మెసేజ్ లు ఇచ్చిన బహుమతులు అన్ని బయటపడ్డాయి.
అలా సాక్ష్యం దొరక్క హిలరి తప్పించుకుంటే సాక్ష్యం దొరికి బిల్ చట్టానికి దొరికాడు.
సాక్ష్యాలు ఇక్కడ చదవండి
హిలరిని జైల్లో పెడతానన్నా ట్రంప్ గెలిచాక ఆ మాట ఎత్తటం లేదు, అలాగే భారత దేశం లో ఎదో అవకతవకలు జరిగాయి దోషుల్ని జైల్లో పెడతామన్న ఇంకో పార్టీ నోరు మూగపోయింది. సెక్రటరీ ఒక్కోసారి మన కళ్ళు చెవులు మనల్నే మోసంచేస్తాయన్న పాత సినిమా డైలాగ్ గుర్తుకు తెచ్చుకుంటే ప్రతి నేరం సాక్ష్యాధారాలతో తీర్మానించాలి అన్నది అర్థమవుతుంది. ఆ సాక్ష్యాన్ని సంపాదించే CBI లాంటి వారు ప్రెసిడెంటునే DNA టెస్ట్ చేయించిన FBI ముందు దిగదుడుపే.వ్యవస్థ లోపాలు అంతత్వరగా మార్చలేము.
బ్రిటిష్ వారి కలెక్టర్ వ్యవస్థ బ్యురోక్రసికి నాంది పలికింది. అసలు కలెక్టర్ అనేవాడు ప్రజోద్యోగి కాదు కేవలం సుంకం వసులు చేసే “బ్రిటిష్ గుమస్తా”.
ఈ విషయం అర్థమయ్యి IAS, IPS, IFS, IES ఏ I తో ప్రారంభమయ్యే ఉద్యోగుల ప్రాథమిక పని “administer” చెయ్యటం కాదు “నిజాయితీగా సేవ చెయ్యటం” అని ప్రజలు నిలదీసే వరకు 2G స్కాములు మళ్ళి మళ్ళి జరుగుతాయి
2G To బెంగాజి సాక్ష్యం

Share: