ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. వక్ఫ్ బోర్డు ప్రక్షాళన కోసం నడుం కట్టింది. వేల కోట్ల రూపాయల ఆస్తులను కేవలం వందలోపు కుటుంబాలు దొంగ చాటుగా అనుభవిస్తున్నాయి అని ముస్లిం లే చెబుతుంటారు. ఈ దేశంలో రైల్వే, రక్షణ శాఖ తర్వాత.. అంతటి స్థాయిలో భూములు వక్ఫ్ బోర్డు దగ్గర ఉండిపోయాయి. లక్షల కోట్ల రూపాయలు ఆస్తులను కబ్జా చేసి అనుభవిస్తున్నారు.
ఈ వక్ఫ్ బోర్డు లు పూర్తిగా కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డు ల నిర్వాహణ లో పారదర్శకత తెచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందుకోసం పార్లమెంటు లో బిల్లు ప్రవేశ పెట్టింది. కానీ దీనిని పార్లమెంటు కమిటీ అధ్యయనం కోసం పంపించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఈ బిల్లుకి ఆమోదం లభిస్తుంది.
ప్రస్తుతం ఉన్న వక్స్ చట్టం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఈ చట్టాన్ని సవరించకపోతే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి వంటి అంశాల మీద ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను ఈ పార్లమెంటు కమిటీ సేకరిస్తున్నది. అందుచేత ప్రజలు స్పందించి తమ అభిప్రాయాలను ఇంగ్లీషు లేదా హిందీ భాషల్లో ఈ కమిటీ కి పంపాలి.
Joint Secretary (JM)
Lok Sabha Secretariat
440, Parliament House
New Delhi 110001
Fax: 011 – 2301 7709 అనే చిరునామాకు పంపించాలి
లేదా
డాక్యుమెంట్ రూపంలో
jpcwaqf-lss@sansad.nic.in కు ఈ మెయిల్ చేయవచ్చు .
పోస్ట్ చేయలేని లేదా ఫ్యాక్స్ చేయలేని వారు .. కనీసం తమ వ్యాఖ్యలను jpcwaqf-lss@sansad.nic.in కి ఇమెయిల్ చేయవచ్చు.
వక్ఫ్ బోర్డు ప్రక్షాళన కోసం మద్దతుగా ఎక్కువ మంది అభిప్రాయాలు పంపిస్తే మన దేశానికి, సమాజానికి మేలు కలుగుతుంది.