విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మర్రిపాక వద్ద మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అరగంటపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టులు తప్పించుకున్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల సామగ్రిని, విప్లవసాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.