చత్తీస్ గఢ్ లో మళ్లీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. పొమర్రా-హల్లూరు అటవీప్రాంతంలో 50మందికి పైగా మావోయిస్టులు సమావేశమైనట్టు పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో బలగాలు మెరుపుదాడి చేశాయి. ఇరువర్గాల ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. వారిలో ఇద్దరు మహిళాసభ్యులున్నారు. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు అడవిలో గాలింపు కొనసాగిస్తున్నారు.