మహ్మద్ ప్రవక్తను దూషించారనే కారణంతో నూపుర్ శర్మపై ఇస్లామిస్టుల దాడులు ఆగడం లేదు. ఆమెను చంపేస్తామనీ బెదిరిస్తూ…తలకు వెలకడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శుక్రవారం పలు ప్రాంతాల్లో ప్రార్థనల అనంతరం మొదలైన నిరసనలు కొన్నిచోట్ల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ లోని పలు నగరాలు, పట్టణాల్లో ముస్లింలు పెద్దసంఖ్యలో వీధుల్లోకి వస్తున్నారు. సూరత్, అహ్మదాబాద్, రాజ్‌కోట్‌లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మార్చ్‌లో పాల్గొన్న మహిళలు గందరగోళం సృష్టించడంతో.. అహ్మదాబాద్‌లోని జుహాపురా ప్రాంతంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మత విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారంటూ సూరత్ లో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నూపుర్ శర్మను చంపేస్తామంటూ పోస్టర్లు అంటించినందుకు ఐదుగురు వ్యక్తులను రాజ్‌కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అటు అహ్మదాబాద్ లోని జుహాపురాలో జరిగిన నిరసన ర్యాలీలో పెద్దసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పోలీసులు అప్రమత్తంగానే ఉన్నా నిరసనకారులు వారిని పదే పదే రెచ్చగొట్టసాగారు. దీంతో ఆందోళనకారులపైకి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పలువురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌లో నమాజ్ తర్వాత వీధుల్లోకి రావాలని ప్రజలను తన ఫేస్బుక్ ప్రొఫైల్‌లో రెచ్చగొట్టే పోస్ట్‌ను షేర్ చేసిన వ్యక్తిపై సైబర్ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది.
రాజ్‌కోట్‌లోని ఆజాద్ చౌక్ సమీపంలో నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో పోస్టర్లు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టర్లను తొలగించి, ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రామ్నాథ్పరాలోని హుస్సేనీ చౌక్ వెలుపల నూపుర్ శర్మ పోస్టర్లు అతికించడాన్ని చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించి, ఐదుగురిని పట్టుకున్నారు. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద ప్రకటనలకు నిరసనగా మూడు రోజుల క్రితం మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖులు రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించడం గమనించదగ్గ విషయం.
సూరత్‌లో నూపుర్ శర్మపై షూ ముద్ర ఉన్న పోస్టర్లను అతికించినందుకు.. అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లలో ఏమి జరిగిందో అది గుజరాత్ లో జరిగేలా చూడాలని ముస్లింలకు పిలుపునిస్తూ వాట్సాప్‌లో మెసేజ్ వ్యాప్తి చేసినందుకు కూడా అరెస్టులు జరిగాయి.
వైరల్ వీడియో, టెక్స్ట్ మెసేజ్ లను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. మహ్మద్ తౌఫిక్ మహ్మద్ రఫీక్ షేక్ (నాన్పురాలోని చాంద్ సుబేదార్ బిల్డింగ్ నివాసి), సద్దాం రవూఫ్ సయ్యద్ (జమల్షా మొహల్లా నివాసి) పోస్టర్లను అతికించిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఇద్దరిని విచారించిన అనంతరం నగరంలోని ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి ఇమ్రాన్ హబీబ్ ఖాన్ పఠాన్ వద్దకు పోలీసులను తీసుకెళ్లారు, అతను ఇద్దరి కోసం నుపుర్ శర్మ పోస్టర్లను ముద్రించాడు. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్లో మతం, వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పద పోస్టులపై పోలీసులు, సైబర్ సెల్ నిఘా ఉంచింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రెచ్చగొట్టే పోస్ట్‌లను షేర్ చేసి ప్రజలను వీధుల్లోకి వచ్చేలా ప్రేరేపించే వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ పోలీసులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశార