అమరావతి కేసు విచాణ నుంచి వైదొలిగారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిల్ లలిత్.
రాజధాని రైతులు, ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో బెంచ్ కు బదిలీ చేయాల్సిందిగా రిజిస్ట్రీని కోరారాయన.
విచారణ ప్రారంభమైన కాగానే… గతంలో విభజనచట్టం, సీఆర్డీఏ చట్టాలపై సీజేఐ లలిత్ గతంలే తెలిపిన అభిప్రాయాలను ప్రస్తావించారు ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ ఆర్యమ సుందరం ప్రస్తావించారు. అయితే నాకే విషయం తెలియదు అని.. ఏ అభిప్రాయం చెప్పానో వివరిస్తారా అని న్యాయవాదిని సీజేఐ అడిగారు. వెంటనే న్యాయవాది దానికి సంబంధించిన లేఖను ఆయనకు అందచేశారు. దీంతో ఆయన వెంటనే ఆ కేసునుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మీరు విచారించినా తమకేం అభ్యంతరం లేదని… విభజన చట్టం, సీఆర్డీఏ చట్టాలపై ఇచ్చిన అభిప్రాయాన్ని సదుద్దేశంతోనే తమ దృష్టికి తీసుకువచ్చామని ఆయన తెలిపారు. అయినా సరే ఆ కేసును విచారించేందుకు విముఖత వ్యక్తం చేశారు సీజేఐ. తాను సభ్యుడిగా లేని బెంచ్‌కు కేసును పంపాలని రిజిస్ట్రీకి సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి తేదీని ప్రకటించాలని అమరావతి తరపు లాయర్లు కోరారు. వీలును బట్టి రిజిస్ట్రీ తేదీని ఖరారు చేస్తుందని సీజేఐ లలిత్ వెల్లడించారు.