ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే CJ వెర్లెమాన్ ట్విట్టర్ అకౌంట్ ను భారతదేశంలో ట్విట్టర్ నిలిపివేసింది.ట్విట్టర్ ఈ నిర్ణయం ఇవాళే తీసుకుంది. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయంతో విసుగు చెందిన వెర్లెమాన్ ట్విట్టర్లో విరుచుకుపడ్డాడు. భారతీయ ప్రేక్షకుల కోసం బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వ సూచనల మేరకు ట్విటర్ పనిచేస్తోందని, అలాగే తన ఖాతాను బ్లాక్ చేసిందని అతడు నిందించాడు.
ట్విటర్ భారత ప్రభుత్వానికి రక్షణ రాకెట్‌గా పనిచేస్తుందనేది మళ్ళీ రుజువైంది. నరేంద్ర మోదీ మితవాద, హిందూ ఫాసిస్ట్ పాలన చేసిన డిమాండ్ల కారణంగా ఇప్పుడు భారతదేశంలో నా ఖాతాను నిలిపివేశారు. ఇది ఎలా ఉంది జాక్, ఎలోన్ మస్క్ ? అంటూ వారిని ప్రశ్నిస్తూ ట్విట్టర్ లో ట్యాగ్ చేసాడు.
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని నకిలీ వార్తలను ప్రచురించడంలో CJ వెర్లెమాన్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. అతడు క్రమం తప్పకుండా పాత వీడియోలు, చిన్న నేర సంఘటనలను షేర్ చేస్తుంటాడు, కొన్నిసార్లు భారత ప్రభుత్వం ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని బయట ప్రపంచానికి చెప్పడానికి పచ్చి అబద్ధాలను చెప్తుంటాడు. అతడు భారతదేశంలోని హిందువులపై ద్వేషం, అసత్యాలను వ్యాప్తి చేస్తాడు.
CJ వెర్లెమెన్కు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేక పగ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది, బహుశా కాషాయ వస్త్రం ధరించిన సన్యాసి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడమే కారణం కావచ్చు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ‘హిందూత్వ ఉగ్రవాది’గా అతడు పలు ట్వీట్లలో పేర్కొన్నాడు.