Churches Atrocities || దేవాదాయ అధికారుల మీద పగబడ్డిన చర్చిలు…
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం చుట్టూ క్రైస్తవ మాఫియా తిష్ట వేసింది. చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలు,గిరిజన గ్రామాల్లో చర్చిలు విపరీతంగా ఏర్పాటు అయ్యాయి. పెద్ద ఎత్తున మత మార్పిడులు చేస్తూ, పూర్తి స్థాయి క్రైస్తవ గ్రామాలుగా మార్చేసుకొంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం మీద మిషనరీలకు కడుపు మంట ఎక్కువగా ఉంటోంది. అక్కడ ఉండే అమాయక గిరిజనుల్ని గుప్పిట్లో పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా దేవాలయం ఈవో రమాదేవి మీద దాడులకు దిగటం కలకలం రేపుతోంది
……
భద్రాచటం గ్రామం దాటి కొంతదూరం ప్రయాణిస్తే ఆంధ్రప్రదేశ్ గిరిజన గ్రామాలు మొదలు అయిపోతాయి. ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి ఆలయానికి సంబంధించిన 889.50 ఎకరాల భూములు ఉన్నాయి. రామాలయానికి చెందిన 889.50 ఎకరాల భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు ఆక్రమణదారులు ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు.
..
ఈ సమాచారం అందుకొన్న దేవాదాయ శాఖ అధికారులు అక్రమార్కులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దేవుడి భూములను కబ్జా చేయటం తప్పు అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దేవుడి భూముల జోలికి వస్తే పాపం తగులుతుందని సర్ది చెప్పారు. కానీ అక్కడ గిరిజనులను అప్పటికే రెచ్చగొట్టేశారు. ఈ గుంపులో కలిసిపోయిన క్రైస్తవ మాఫియా.. స్థానికులను రెచ్చగొట్టింది. ఆలయ ఈవోపై స్థానికులు గుంపులుగా దాడికి తెగబడ్డారు. గ్రామస్థుల దాడిలో స్పృహ కోల్పోయిన ఆమెను ఆలయ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. సకాలంలో రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు వర్గాలను అదుపు చేసి, పరిస్థితిని చక్కదిద్దారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో గొడవ జరగటంతో సహజంగానే రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా రంగు పులుముకొంది.
……………..
ఈ దాడుల వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నమాట వినిపిస్తోంది. కొంత కాలంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ధర్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగుతోంది. దీంట్లో చురుకైన పాత్ర పోషిస్తున్న దేవాదాయ శాఖ అధికారుల మీద క్రైస్తవ మాఫియా పగ పట్టింది. అందుచేతనే అదును చూసుకొని గిరిజనులను రెచ్చగొట్టి, వెనుక ఉండి రహస్యంగా దాడులు చేయిస్తోంది. ఈ రకమైన దాడులు చేయిస్తే భయపడిపోయిన అధికారులు గ్రామాల్లోకి వచ్చేందుకు సాహసం చేయరు అన్నది అసలు స్కెచ్. ఇక్కడ దాడులకు గురి అయింది హైందవ అధికారులు కాగా, పోలీసు కేసుల్లో బుక్ అయిపోయింది ఆవేశంగా దాడులకు దిగిన గిరిజనులు. దీనికి ఆంధ్ర, తెలంగాణ కలర్ ఇచ్చేసిన క్రైస్తవ మిషనరీలు.. సైలంట్ గా చోద్యం చూస్తున్నాయి.