తెలుగు సినిమాల్లో చర్చిలు అంటే ప్రేమ, కరుణలకు కేంద్రాలుగా చూపిస్తుంటారు. కానీ వాస్తవంలో చర్చిలలో చాలానే అఘాయిత్యాలు చోటు చేసుకొంటూ ఉంటాయి. ముఖ్యంగా అక్కడ ఉండే నన్స్, మహిళల మీద లైంగిక వేధింపులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇవేమీ బయటకు రాకుండా పాస్టర్లు, చర్చి పెద్దలు అడ్డు పడుతూ ఉంటారు. వేలల్లో ఒకరు ఇద్దరు మాత్రం ధైర్యం చేసి, చర్చి గోడల నుంచి బయటకు వచ్చి తమ సమస్యలు బయట పెడుతూ ఉంటారు.
…
ఇప్పుడు నల్లగొండ క్రైస్తవ బిషప్ ధమన్ కుమార్ మీద లైంగిక ఆరోపణలు బయటపడ్డాయి. జర్మనీలోని మున్స్టర్ నగరంలో బిషప్‌గా వున్న సమయంలో లైంగిక అత్యాచారాలు చేసినట్లు సమాచారం. వరుసగా రెండేళ్లపాటు మహిళల మీద లైంగిక అత్యాచారాలు చేసినట్లు ఫిర్యాదు నమోదు అయింది.. దీంతో బిషప్ కర్ణం ధమన్ కుమార్‌ను చర్చి బాధ్యతల నుంచి తొలగించారు. దీనికి సంబంధించి మున్ స్టర్ బిషప్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి “ది న్యూస్ మినిట్” వెబ్సైట్ ఓ కథనం ప్రచురించింది.
…….
బిషప్ ధమన్ కుమార్ చర్చి జీవితంలో చక చకా పైకి ఎదిగారు. విలాసవంతమైన చర్చి అధికారిగా ఆయనకు పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ధమన్‌కుమార్ మొదట్లో అక్కడే పాస్టర్ గా ప్రవేశించారు. 2001 నుంచి 2012 వరకు మున్స్టర్ నగరంలో మత గురువుగా పనిచేశారు. తర్వాత 2017లో భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ మతబోధకుడిగా ప్రచారం చేశారు. తిరిగి 2017 నుంచి 2020 వరకు జర్మనీలో ఉన్నతస్థాయి ఫాదర్‌గా పనిచేశారు. పోప్ ఫ్రాన్సిస్ 2024 ఏప్రిల్‌లో ధమన్కుమార్ను నల్లగొండ బిషప్‌గా నియమించారు. అప్పటి నుంచీ నల్లగొండ లో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నారు.
….
చర్చి పాస్టర్ ల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు కొత్తేమీ కాదు. భారత దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో జరుగుతూనే ఉన్నాయి. బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేసిన సంఘటనలు చాలా తక్కువ.
1. తమిళనాడు – మహానాడు ప్రాంతం లో 2022 లో చర్చిలో కలకలం రేగింది. స్థానికంగా క్రైస్తవ మిషనరీ పాస్టర్ మహిళలను లైంగికంగా దోచుకొంటున్నారని ఫిర్యాదు వచ్చింది. పోలీలసు దర్యాప్తులో నిజం అని తేలటంతో అతను అరెస్టయ్యాడు. అయినప్పటికీ, చర్చ్ నిర్వాహకులు ఈ ఘటనపై దర్యాప్తుకు సహకరించకపోవడం గమనార్హం.
2. ఆంధ్రప్రదేశ్ – గుంటూరు జిల్లా లో 2021 లో… ఓ ప్రైవేట్ క్రైస్తవ పాఠశాలలో పనిచేస్తున్న పాస్టర్ స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగాడు. స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు ఈ ఘటనను మీడియా ముందుకు తీసుకురాగ, పోలీస్ దర్యాప్తు ప్రారంభమైంది. దీనిని కప్పి పుచ్చేందుకు చర్చి నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నించారు.
3. కేరళ – మలయాళీ క్రైస్తవ సంఘంలో 2018 లో సామూహిక అత్యాచారం కలకలం రేపింది. ప్రముఖ చర్చ్‌లో నలుగురు పాస్టర్లు ఒక మహిళను సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడు ఆమె ను, కుటుంబాన్ని చర్చి పెద్దలు బెదిరించి నోరు నొక్కేసేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరగటంతో పోలీసు దర్యాప్తు మొదలైంది.
4. తెలంగాణ – ఖమ్మం లో 2020 లో ఒక కేసు నమోదు అయింది. స్థానిక చర్చ్ పాస్టర్ మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయిన తరువాత అతనిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకున్నారు…………
ఇదే మాదిరిగా లెక్కలు వేస్తే పెద్ద సంఖ్యలో సంఘటనలు ఉంటాయి. నిజానికి ఇప్పుడు వేల సంఖ్యలో చర్చిలు పుట్టుకొని వచ్చాయి. అక్కడ ఏమి జరుగుతుంది అనే దాని మీద ఎవరికీ అజమాయిషీ లేదు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ అటు వైపు వెళ్లనే వెళ్లరు. చర్చి చీకటి సామ్రాజ్యంలో మహిళలు బలి అవుతూనే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రం నల్లగొండ బిషప్ ధమన్ కుమార్ వంటివాళ్ల అఘాయిత్యాలు వెలుగు చూస్తూ ఉంటాయి.