………..
కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ క్రైస్తవ కుటుంబం అన్న సంగతి తెలిసిందే. అందుచేత అక్కడ హై కమాండ్ మార్కులు కొట్టేసేందుకు, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదే క్రమంలో క్రైస్తవ మత మార్పిడులకు కాంగ్రెస్ నేతలు జై కొడుతున్నారు. కర్నాటకలోని సిద్ధ రామయ్య టీమ్ అయితే మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు..
……..
కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు కర్నాటక ప్రభుత్వం కుల గణన ను ఆయుధంగా మలచుకొంది. సెప్టెంబర్ నెల 22 న మొదలు అయ్యే కుల గణన .. పెద్ద దుమారమే లేపుతోంది. ముఖ్యంగా కుల గణన చేసేటప్పుడు.. ప్రతి కులం వెనుక “క్రిస్టియన్” అనే పదాన్ని జోడిస్తున్నారు. మత మార్పిడిలు చేసుకొంటే బీసీ వర్గాలుగా చూపించి, బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామంటూ సిద్ద రామయ్య ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కర్నాటక ప్రభుత్వ కుల గణన లో ఇందుకు అనుగుణంగా ప్రాతిపదికలు కల్పించారు. అంటే లింగాయత్ హిందూ, లింగాయత్ క్రైస్తవ, ఒక్కళిగ హిందూ, ఒక్కళిగ క్రైస్తవ పేరుతో జనాభా లెక్కిస్తారు అన్నమాట.
……..
వాస్తవానికి సిద్ధరామయ్య మొదట నుంచీ క్రైస్తవ మతమార్పిడులకు అనుకూలంగానే ఉంటున్నారు. హిందూ మతంలోని అసమానతలు వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయి అని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. అనేక సార్లు క్రైస్తవ మత కార్యక్రమాలలో ఆయన చాలా సార్లు పాలు పంచుకొన్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు కూడా ప్రయత్నాలు తీవ్రంగా చేసేసుకొంటున్నారు. ఇందుకు కుల గణన ను ఉపయోగించుకొంటున్నారు.
…….
కర్నాటకలో బీసీ వర్గాల సంఖ్య రాష్ట్ర జనాభాలో సుమారు 70 శాతం వరకు ఉంటుంది. ఈ వర్గీకరణలో మార్పులు చేయడం అనేది పెద్ద స్థాయిలో ప్రభావం చూపే అంశం. ఈ పరిస్థితుల్లో బీసీ వర్గాలపై తీసుకునే ఏ నిర్ణయం అయినా సామాజిక, రాజకీయ రంగాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు లో క్రైస్తవాన్ని బాగా పెంచుకొని, దానిని బలమైన ఓటు బ్యాంకు గా మలచుకొనేందుకు సిద్ద రామయ్య ప్రయత్నాలు చేస్తున్నారు.
……..
ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కాబట్టి కర్నాటకలో తీసుకున్న విధానాన్ని ఉదాహరణగా తీసుకుని, భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపునిస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలతో క్రైస్తవ మత మార్పిడులను ప్రోత్సహిస్తారు అని చెబుతున్నారు.