మన సినిమాల్లో క్రైస్తవ పాస్టర్ లు అనగానే శాంతికి, సేవకు ప్రతీకలు గా చూపిస్తారు. విలన్స్ కు మాత్రం పెద్ద బొట్టు పెట్టి పూజలు చేస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఫలితంగా క్రైస్తవ మతం శాంతి సామరస్య కూడినదని హిందూ మతం అంటే విద్వేషాలయం అని పదేపదే నూరిపోసేందుకు మన సినిమా పెద్దలు తెగ తాపత్రయపడుతూ ఉంటారు. ఇటు మీడియా కూడా తక్కువేమీ తినలేదు. ఏదైనా ఆలయంలో, హైందవ మఠంలో చిన్న తప్పు దొర్లిన టీవీ చానల్స్ గుండెలు బాదేసుకుంటాయి. కానీ క్రైస్తవ చర్చిలలో కానీ క్రైస్తవ పాటలు నడిచే మతాలలో గాని ఎన్ని ఘోరాలు జరిగినా పెద్దగా చూపించవు.
ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న క్రైస్తవ పాస్టర్ క్విబోలోయ్ పోలీసులకు దొరికిపోయాడు. నాలుగు రోజులు క్రితమే ఇతని బండారం బయటపడినప్పటికీ మన మీడియా సంస్థలు గప్ చుప్ గా ఉండిపోయాయి.
పరమ భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని స్థాపించి నిర్వహిస్తున్న క్విబోలోయ్ గురించి తెలుసుకుంటే బుర్ర తిరిగిపోతుంది. పిలిప్పీన్స్ తోపాటు అమెరికా దేశాల ‘వాంటెడ్’ జాబితాలో ఉన్న ఈ 74 ఏళ్ల ఈ పాస్టర్ ను పట్టుకునేందుకు దాదాపు 2000 మంది పోలీసులు పని చేశారు . నేరుగా యేసుక్రీస్తు నామాన్ని తీసుకొని కింగ్ డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట 75 వందల ఎకరాల సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. రెండువారాలపాటు అక్కడ పోలీసులు అణువణువూ గాలించారు. ప్రత్యేక నిఘా పరికరాలను తెప్పించి.. వాటిలో నమోదైన హృదయస్పందల ఆధారంగా అతడు అక్కడే అండర్ గ్రౌండ్లో ఒక బంకర్లో దాక్కుని ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వెనుక సైతాను హస్తం ఉందని క్విబోలోయ్ ప్రకటించాడు.
క్రైస్తవ పాస్టర్ క్విబోలోయ్ నేర చరిత్ర అంతా ఇంతా కాదు.
ఫిలిప్పీన్స్ లో పేదరికంలో మగ్గిపోతున్న చిన్నారులకు దాతృత్వం పేరు తో ఆధ్యాత్మిక దుకాణం తెరిచాడు. దైవకార్యం పేరిట క్విటోలోయ్ ఫిలిప్పీన్స్ నుంచి బాలికలను, యువతులను అమెరికాకు తీసుకెళ్లేవాడు. వారంతా.. పగటిపూట విరాళాలు సేకరించాల్సి ఉంటుంది. రాత్రిపూట.. ‘సైట్ డ్యూటీ’ పేరిట వేసే ప్రత్యేక డ్యూటీలో భాగంగా అతడికి, అతడి స్నేహితులకు లైంగిక సేవలు అందించాలి. అందుకు ఒప్పుకొన్నవారికి డిస్నీలాండ్ సందర్శన, ప్రైవేటు జెట్ విమానంలో టూర్ల వంటి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కాదన్న వారికి ‘శాశ్వత నరకం’ తప్పదని బెదిరించేవారు. ‘సైతాను బిడ్డ’ అని రాసి ఉన్న దుస్తులువారికి వేసి గదుల్లో బంధించేవారు. ఈ విషయాలన్నీ 2021లోనే బయటపడినా.. అతడు అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యకుడు రోడ్రిగో … కు బాల్యస్నే హితుడు . పైగా ఆధ్యాత్మిక సలహాదారు కావడంతో అతడి అరెస్టుకు ఎవరూ సాహసించలేదు. 2022 లో ఆయన పదవీకాలం ముగిశాక క్విబొలోయకి కష్టాలు మొదలయ్యాయి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కూడా అతడిపై అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఆ ఆశ్రమంలోని ఒక కొండమీద అతడికో కోట ఉంది దానిపేరు.. ‘గార్డెన్ ఆఫ్ ఈడెన్ రిస్టోర్డ్’ అని పేరు పెట్టుకున్నాడు. సొంత టీవీ, రేడియో, సోషల్ మీడియా నెట్వర్క్ కూడా ఉన్నాయి.
ఇంతటి తీవ్రమైన నేర సామ్రాజ్యాన్ని నడిపినప్పటికీ,,, క్విబోలోయ్ గురించి మన మీడియా పెద్దగా మాట్లాడటం లేదు. ఎప్పటిలాగే కళ్లకు గంతలు కట్టుకొని చేసి కాలక్షేపం చేసేస్తున్నది.