మన సమాజంలో క్రైస్తవ చర్చిలు చేసే అరాచకాలు అన్నీ, ఇన్నీ కావు. మతం మారిపోయాక క్రైస్తవులు.. చాలా హడావుడి చేస్తూ ఉంటారు. హిందువుల ప్రసాదం తీసుకోరు., ఇతర మతాలయాల వైపు చూడనే చూడరు. ఈ మాదిరిగా ఓవర్ యాక్షన్ చేసిన ఒక క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
………………
అశ్వికదళ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా ఉన్న శామ్యూల్ కమలేషన్ వివాదాలకు పెట్టింది పేరు. ఒక సందర్భంలో తోటి సైనికులతో కలిసి గురుద్వారాలోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సైనిక సోదరులకు సంఘీభావం తెలపాలని శామ్యూల్ కు ఉన్నతాధికారులు సూచించారు. కానీ, ఉన్నతాధికారి ఆదేశాలను పట్టించుకోకుండా శామ్యూల్ తిరస్కరించాడు. ఇది తన క్రైస్తవ ధర్మాన్ని ప్రభావితం చేస్తుందంటూ హడావుడి చేసేశారు. గుడికి వెళ్ళను ప్రసాదం తీసుకోను అని అందరి ముందు ఇతర మతాలను కించపరుస్తూ మాట్లాడారు.
………………
సైన్యంలోనే సైనిక సోదరులు అన్ని మతాల ఆలయాలను సందర్శించడం ఆనవాయితీ. తామంతా కలిసి ఉంటామని తెలియచెప్పేందుకు ఈ సాంప్రదాయం పాటిస్తారు. కానీ మతమార్పిడి చేయించుకున్న నయా క్రైస్తవులు మాత్రం ఈ కట్టుబాటు తప్పుతున్నారు. ఈ విషయం మీద సుప్రీం కోర్టు లోతుగా పరిశీలన జరిపింది. ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాల కన్నా, మతాన్ని ఎక్కువగా చూస్తున్నారని, ఇది స్పష్టంగా క్రమశిక్షణను ఉల్లంఘించడం అని తీర్పు చెప్పింది. ఇది సైనిక ధర్మాన్ని ఉల్లంఘించడమే అని తీర్పు చెప్పింది. అనవసరంగా ఫోజులు కొట్టే క్రైస్తవులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.



