తమిళనాడు తంజావూరుకు చెందిన బాలిక లావణ్య ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుతున్నలావణ్యను పాఠశాల యాజమాన్యం మతం మారాల్సిందిగా ఒత్తిడి తేవడంవల్లే తాను ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులే ఆరోపిస్తున్నారు.
తంజావూరులోని తిరుకట్టుపల్లికి చెందిన లావణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న చనిపోయింది. అయితే తన కుమార్తెను మతం మారమని ఒత్తిడి తెచ్చారని తాను నిరాకరించడంతో టార్చర్ పెట్టారని అందుకే లావణ్య ఆత్మహత్య చేసుకుందని తండ్రి మురుగానందం ఆరోపిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ తనను మతం మారాలని ఒత్తిడి తెచ్చారని లావణ్య చెప్పినట్టుగా ఉన్న 44 సెకన్ల వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
లావణ్య గత ఐదేళ్లుగా సెయింట్ మైఖేల్స్ బాలికల హాస్టల్లో ఉంటోంది. అయితే స్కూల్ వార్డెన్ కొంతకాలంగా తనను క్రైస్తవంలోకి మారాలని ఇబ్బంది పెడుతోంది. మతం మారేప్రసక్తే లేదని లావణ్య చెప్పడంతో ఆమెకు వేధింపులు పెరిగాయి. పొంగల్ వేడుకలకోసం ఆమె పెట్టుకున్న సెలవు దరఖాస్తునూ టీచర్లు రద్దు చేశారు. సెలవుల్లో ఇంటికి పంపకుండా పాఠశాలలోని మరుగుదొడ్లు కడిగిస్తూ వంటచేయిస్తూ …గిన్నెలు కడిగిస్తూ టార్చర్ పెట్టారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేని లావణ్య స్కూల్ గార్డెన్ కోసం వాడే పురుగుమందు తాగింది.
ఆమెకు వాంతులు రావడంతో స్థానిక క్లినిక్ కు తీసుకెళ్లారు. అక్కడినుంచి హాస్టల్ వార్డెన్ ఆమెతల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. వారు వచ్చి హుటాహుటిన తంజావూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తులు దాదాపు పాడైపోయిన స్థితిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి మెరుగవకపోగా మరింత క్షీణించి జనవరి 19న చనిపోయింది.
ఆ తరువాత ఆమె చివరిమాటలుగా చెబుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అపస్మారకస్థితిలో ఉన్న లావణ్య… స్కూల్ వాళ్లు తనను క్రైస్తవమతంలోకి మార్చగలరా…అప్పుడే చదువుకు ఇబ్బంది ఉండదు అని తన ముందే తల్లిదండ్రులను అడిగారని…నేను అంగీకరించకపోవడంతో తిడ్తూనే నిరంతరం చిత్రహింసలు పెట్టారని వార్డెన్ రాచెల్ మేరీ వేధింపులు భరించలేకపోయానని అందుకే చనిపోవాలనుకున్నానని చెప్పింది. ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బలవంతపు మతమార్పిడికి పాల్పడి లావణ్య చావుకు కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
అటు క్రైస్తవ మాఫియా ఆగడాలను నిరసిస్తూ వీహెచ్పీ , హిందూ మున్నాని, రాజకీయసంస్థ ఇందు మక్కల్ కట్చి వంటి హిందూ సంస్థలూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. మతమార్పిడి మాఫియా రెచ్చిపోతోందని…వాళ్ల ఆగడాలకు విద్యార్థులు బలవుతున్నారని ఆరోపించాయి. కేవలం తమిళనాడులోనే కాదు మతమార్పిడి మాఫియా ఆగడాలు దేశవ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. హిందువులను లక్ష్యంగా ఓ వైపు క్రైస్తవ మాఫియా, మరోవైపు జిహాదీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాళ్ల ఆగడాలు భరించలేక కొందరు ప్రాణాలు తీసుకుంటుంటే కొందరు హత్యలకూ గురవుతున్నారు. 2019లో త్రిపురలో ఇలాంటి ఘటనే జరిగి ఓ యువతి బలైంది. ఇక తమిళనాడులో ముస్లింలు కొందరు హిందువులను బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకున్న యువకుడిని దారుణంగా హత్య చేశారు.