తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్థిక సహాయంతో నడుస్తున్న శ్రీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అపచారం జరుగుతోంది. శ్రీనివాసుని డబ్బులు జీతం గా పుచ్చుకుంటున్న ప్రొఫెసర్లే.. విశ్వాసం మర్చిపోయి,, క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు. హిందువుల హుండీ డబ్బుతో క్రైస్తవానికి బాటలు వేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్
చెంగయ్య.. అనేక సంవత్సరాలుగా క్రైస్తవ మత బోధనలు చేస్తున్నారు. గతంలో చుట్టుపక్కల గ్రామాల్లో మతమార్పిడులకు పాల్పడే చేంగయ్య.. ఇప్పుడు క్యాంపస్ లోనే క్రైస్తవ మత ప్రచారం మొదలుపెట్టారు. ఈ సమాచారం అందుకున్న
బజరంగ్ దళ్ కార్యకర్తలు, హిందువులు ఆందోళన చేపట్టారు. ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చంగయ్య విద్యార్ధులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్నారంటూ బజరంగ్ దళ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి రోజు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు సబ్జెక్టుకు బదులుగా బైబిల్ని బోధిస్తూ, హిందూ దేవుళ్లను కించపరుస్తూ మానసికంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు.
తిరుపతికి చెందిన హైందవ కార్యకర్తలు క్యాంపస్ కు చేరుకొని ఆందోళన చేపట్టారు.
ప్రొఫెసర్ చెంగయ్య కార్యాలయంలో క్రైస్తవ మతాలకు సంబంధించిన ఫొటోలు, సాహిత్యాన్ని బజరంగ్దళ్ నాయకులు గుర్తించి వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు.
చంగయ్యపై చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్‌కి వినతిపత్రం అందజేశారు. విద్యార్ధులకు క్రైస్తవ ప్రచార బోధన చేస్తున్న ఆడియో క్లిప్పింగ్‌లు బయటకు వచ్చాయని తెలిపారు. అన్యమత ప్రచారంపై వైస్ ఛాన్సలర్ అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
హైందవ కార్యకర్తల ఫిర్యాదు మీద యూనివర్సిటీ స్పందించింది. ఈ విషయం మీద విచారణ జరిపేందుకు ఒక కమిటీని నియమించింది.