చోరికి గురైన కోటి రూపాయలు విలువైన 500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసారు చిత్తూరు జిల్లా పోలీసులు.. చాట్ బాట్ లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో ఉన్న ఫోన్లను కూడా గుర్తించి రికవరీ చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
ఆధునిక సాంకేతికత సాయంతో మొబైల్ ఫోన్ దొంగలు ఆట కట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు.. దాదాపు కోటి రూపాయల విలువచేసే ఐదు వందలకు పైగా ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధితులకు అందజేశారు.. చిత్తూరు జిల్లా లో కొట్టేసిన ఫోన్లు జమ్ము కాశ్మీర్లో ఉన్నప్పటికీ లేటెస్ట్ చాట్ బాట్ టెక్నాలజీ ఉపయోగించి గుర్తించినట్టు ఎస్పీ విశ్వంత్ రెడ్డి తెలిపారు. కొన్ని కేసుల్లో భాదితుల ఫిర్యాదు అందిన 4 గంటల లోపు మొబైల్ ఫోన్ రికవరీ చేసామన్నారు.. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరి చేసి భాధితులకు అందజేశాం.. జమ్మూ & కాశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ల రికవరీ చేసినట్లు తెలిపారు. ఇక దొరకవు అన్న ఫోన్లు మళ్ళీ తమ కళ్ళ ముందు కనిపించేటప్పటికి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.. ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్న బాధితులు.. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. ఫోన్లో రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినందించారు.. ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి “చాట్ బాట్” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితులు మళ్లీ పొందవచ్చునని తెలిపారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు.. ఇక మొబైల్ ఫోన్లు పోయినవారు
వివరాలు CHAT BOT ఎలా పంపించాలన్న విధానం పరిశీలిస్తే..
ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help అని పంపాలి.. తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు HI లేదా HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది.ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేసిన వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది. వెంటనే ఆ మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు చాట్ బాట్ బృందం నిపుణులు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది.
https://twitter.com/ChittoorPolice/status/1659911191827992576?s=20