ఆంధ్రప్రదేశ్‌లో తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారితే,, అన్నయ్య చిరంజీవి సినిమాల్లో మునిగిపోయారు. ఇటీవల కాలంలో భారీ హిట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సీజన్ కాబట్టి అందుకు తగినట్లుగా చిరంజీవి కూడా ప్రిపేర్ అవుతున్నట్లు అర్థమవుతుంది.
ప్రస్తుతం చిరంజీవి దృష్టి అంతా తన తాజా చిత్రం విశ్వంభర మీద ఫోకస్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ను పంచుకున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు వశిష్ట సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా అదిరిపోయేలా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటించబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. మళ్లీ చిరంజీవి సూపర్ డూపర్ హిట్ అందిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.