నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే అమ్మాయి తల్లి మూడు రోజుల క్రితం మరణించడంతో అనాధగా మారిన చిన్నారికి మేమున్నామన్న భరోసనందిస్తూ సేవా భారతి&జై హింద్ వాట్సాప్ సమూహం సభ్యులు విరాళాలను సేకరించారు..
విరాళాల రూపంలో వచ్చినటువంటి డబ్బులు 101515(ఒక లక్ష ఒకవేయి ఐదువందల పదిహేను రూపాయలు) గ్రామస్తులు, యువకుల సమక్షం లో అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో సేవాభారతి సభ్యులు: కృష్ణదాస్, దామోదర్, డా.ప్రమోద్ చంద్రారెడ్డి,…
ముండే ఈశ్వర్, మైండ్ మీడియా ప్రతినిధి మునిగెల శ్రీధర్, కోస్మెట్ శుద్దోధన్,కొప్పుల నవీన్,యోగేష్,సంతోష్ గ్రామ సర్పంచ్ సాయినాథ్, గ్రామ యువకులు, దత్తు,శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.